కట్టమైసమ్మ జాతర ముగింపు
ABN , First Publish Date - 2023-02-12T23:56:10+05:30 IST
మండలంలోని నారాయణపురం గ్రామంలో ఐదు రోజులుగా అట్టహాసంగా జరుగుతున్న కట్టమైసమ్మ ఆలయ 12వ జాతర మహోత్సవాలు ఆదివారంతో రాత్రితో ముగిశాయి.

అశ్వారావుపేట రూరల్, ఫిబ్రవరి 12: మండలంలోని నారాయణపురం గ్రామంలో ఐదు రోజులుగా అట్టహాసంగా జరుగుతున్న కట్టమైసమ్మ ఆలయ 12వ జాతర మహోత్సవాలు ఆదివారంతో రాత్రితో ముగిశాయి. ఆఖరి రోజు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. వార్షిక మహోత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యే మెచ్చాకు ఆలయ కమిటీ బాధ్యులు, జాతర నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కట్ట మైసమ్మకు మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆఖరి రోజు ఆదివారం అమ్మవారి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం పలువురు దంపతులు పీటల మీద కూర్చుని పూజలు నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో మధ్యాహ్నాం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాదిగా భక్తులు హాజరయ్యారు. అశ్వారావుపేట, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వేలేరుపాడు మార్గంలో ప్రధాన రహదారిపై ఉన్న ఆలయం వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, బీఆర్‌ఎస్ నాయకులు చందా లక్ష్మీనర్సయ్య, మోహనరెడ్డి, వెంకట నరసింహం, నులకాని శ్రీను, సంపూర్ణ, కలపాల శ్రీను, ఆకుల శ్రీనుతో పాటు పలువురు పాల్గొన్నారు.