చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తి
ABN , First Publish Date - 2023-09-10T23:21:33+05:30 IST
చాకలి ఐలమ్మ ప్రజలకు స్ఫూర్తి అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

- విగ్రహావిష్కరణలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
పాలమూరు, సెప్టెంబరు 10 : చాకలి ఐలమ్మ ప్రజలకు స్ఫూర్తి అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం పద్మావతి కాలనీ లోని గ్రీన్‌బెల్టులో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణమ్మ, ముడా చైర్మన్ గంజి వెంకన్న, చైర్మన్ కే.సి నరసింహులు, కౌన్సి ల ర్లు రవికిషన్‌రెడ్డి, గోవిందు, కౌన్సిలర్ తిరుపతమ్మ, ప్రవీణ్, మల్యాద్రి రెడ్డి, రాష్ట్ర రజకసంఘం అధ్యక్షులు వై.పురుషోత్తం, నవకాంత్, రజకసంఘం నాయకులు పాల్గొన్నారు.
మోచి కులస్థులకు సర్టిఫికెట్లు వచ్చేలా చేసినం : మంత్రి
మోచి కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు వచ్చేలా చేశామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బండమీది పల్లిలో రూ.25లక్షలతో నిర్మించిన మోచి కమ్యూనిటీ భవనాన్ని మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. కార్యక్రమంలో మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, మాణిక్యప్ప, వెంకటేష్, విజయ్‌కుమార్, కౌన్సిలర్ లక్ష్మీదేవి, యాదగిరిగౌడ్, లింగంయాదవ్ పాల్గొన్నారు.
శ్రావణమాస ఉత్సవంలో మంత్రి
హన్వాడ : అందరికీ అండగా ఉంటానని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని పుల్పవానిపల్లి గ్రామంలో గ్రామస్థులు శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై పూజలు చేశారు. అనంతరం 1.45 కోట్లతో వేసే బీటీ రోడ్డు పనులకు, 28 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ నరేందర్, ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తహసీల్దార్ కిష్ట్యా నాయక్, జిల్లా కో అప్షన్ అన్వర్, మన్నన్, గ్రామ పెద్దలు సర్పంచులు, ఎంపీ టీసీలు, నాయకులు సత్యన్న, యాదయ్య, అంజిల్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.
రూ.1,11,111 మంత్రికి అందించిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు
రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చు కోసం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హన్వాడ మండల మాజీ జడ్పీటీసీ నరేందర్ దంపతులు లక్షాపదకొండు వేల ఒకవంద పదకొండు రూపాయలను అందించారు.