MLA Kranti Kiran: రెండు వేల నోటు రద్దు అనాలోచిత చర్య
ABN , First Publish Date - 2023-05-20T16:15:11+05:30 IST
రెండు వేల నోటును రద్దు చేయడం అనాలోచిత చర్య అని ఆందోల్ ఎమ్మేల్యే క్రాంతి కిరణ్ అన్నారు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించిందని... కానీ ఎంత బ్లాక్ మనీని కట్టడి చేసిందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టం చెయ్యలేదన్నారు.
సంగారెడ్డి: రెండు వేల నోటును రద్దు చేయడం అనాలోచిత చర్య అని ఆందోల్ ఎమ్మేల్యే క్రాంతి కిరణ్ (Andole MLA Kranthi Kiran) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బ్లాక్ మనీని కట్టడి చేస్తాం అని గతంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించిందని... కానీ ఎంత బ్లాక్ మనీని కట్టడి చేసిందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టం చెయ్యలేదన్నారు. 2016లో ప్రకటించిన నోట్ల రద్దు నాటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్షిణిస్తూ వస్తోందని తెలిపారు. రెండు వేల నోట్ల రద్దు వెనుక బీజేపీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఇంతకు ముందు రద్దు చేసిన నోట్ల తర్వాత దేశంలో వచ్చిన మార్పులు, ఫలితాలపై శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వెనుక బీజేపీ ప్రభుత్వానికి ఏదో ప్రయోజనం ఉన్నదనే తాము నమ్ముతున్నామన్నారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న ఏ ఆర్థికవేత్త కూడా నోట్ల రద్దును సమర్ధించడం లేదని తెలిపారు. తుగ్లక్ లాంటి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉండడం దురదృష్టకరమని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వ్యాఖ్యలు చేశారు.