Share News

మెదక్‌లో విజయం మాదే

ABN , First Publish Date - 2023-11-09T23:39:39+05:30 IST

మెదక్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి గెలుపు గెలుస్తుందని రాష్ట్ర ఆర్థి మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

మెదక్‌లో విజయం మాదే

ఇక్కడ పద్మారెడ్డి గెలుపును.. అక్కడ కేసీఆర్‌ గెలుపును ఎవరూ ఆపలేరు : ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌ నవంబరు 9: మెదక్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి గెలుపు గెలుస్తుందని రాష్ట్ర ఆర్థి మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని మంత్రి మాట్లాడారు. మెదక్‌లో పద్మ గెలుపును రాష్ట్రంలో కేసీఆర్‌ గెలుపును ఎవరు ఆపలేరన్నారు. మెదక్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన పద్మకే ప్రజలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించే కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అవుతారని స్పష్టం చేశారు. ప్రసుత్తం రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలో ఆలోచించే కేసీఆర్‌ ఉండగా ఇతరులకు ఓటు వేసి రిస్కు ఎందుకు తీసుకోవాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో రాష్ర్టాన్ని పాలించిన సమయంలో, ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు గెలుస్తే ప్రతీ పనికి ఢీల్లీ పెద్దల అనుమతి తీసుకోవాలని ఏద్దేవా చేశారు. పార్టీ టికెట్‌ కావాలన్నా, ప్రచారం చేయాలన్నా ఢీల్లీ నాయకులు రావాలని హరీశ్‌రావు విమర్శించారు. ఇలాంటి పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు కావలసింది ఢిల్లీకి వెళ్లి అడిగే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. టికెట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్‌ బీజేపి నేతలు ఆగమాగమవుతున్నారని అన్నారు. వేలంలో టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్‌ నాయకులే అంటున్నారని విమర్శించారు. ఇలాంటి నేతల చేతిలో రాష్ర్టాన్ని పెడితే కుక్కలు చింపిన విస్తరే అవుతుందన్నారు. మెదక్‌ మీద సంపూర్ణమైన అవగాహనతో పద్మ దేవేందర్‌రెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించాలని మంత్రి కోరారు. అభివృద్ధి అంటే అర్థం తెలియని కొంత మంది అవివేకంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి ఓటు వేయవద్దని హరీశ్‌రావు ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మ, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లిఖార్జున్‌, వివిధ మండలాల పార్టీ ఇంచార్జీలు, పూజల వెంకటేశ్వరరావు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బాలకిషన్‌ రావు పాల్గొన్నారు.

మళ్లీ మేమే వస్తాం : ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌, నవంబరు 9: తెలంగాణవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అన్నిరంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నందున ప్రజలు బీఆర్‌ఎ్‌సనే మరోసారి ఆదరిస్తామని జహీరాబాద్‌లో ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసిన అనంతరం ఆయన గురువారం జహీరాబాద్‌లో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. ప్రజాధరణ చూస్తుంటే తామే విజయం సాధిస్తామని ధీమా ఉందన్నారు. జహీరాబాద్‌ నియోజవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని, మున్ముందు మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వలస నాయకులకు అవకాశం కల్పిస్తే జహీరాబాద్‌లో అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఆయనవెంట టీఎ్‌సఐడీసీ చైర్మన్‌ మహ్మద్‌ తన్వీర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌మల్కాపురం శివకుమార్‌, ఆత్మచైర్మెన్‌ పెంటారెడ్డి, టెలికంబోర్డు సభ్యులు శంకర్‌నాయక్‌, ఆయా మండలాల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-09T23:39:40+05:30 IST