రైతు కళ్లదుటే కాడి ఆవులు మృతి

ABN , First Publish Date - 2023-01-10T00:22:04+05:30 IST

రైతు కళ్లెదుటే రెండు కాడి ఆవులు మృతి చెందాయి. మోతె మండలంలోని రాఘవాపురానికి చెందిన రైతు మట్టిపెళ్లి ఎల్లయ్య గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ పొలా నికి కాడి ఆవులతో వెళ్లాడు.

రైతు కళ్లదుటే కాడి ఆవులు మృతి
మృతి చెందిన కాడి ఆవులు

మోతె, జనవరి 9: రైతు కళ్లెదుటే రెండు కాడి ఆవులు మృతి చెందాయి. మోతె మండలంలోని రాఘవాపురానికి చెందిన రైతు మట్టిపెళ్లి ఎల్లయ్య గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ పొలా నికి కాడి ఆవులతో వెళ్లాడు. దుక్కి దున్నిన తర్వాత ఆవులకు ఉన్న మట్టిని శుభ్రం అవుతుందని, సమీపంలో ఉన్న చెరువు గట్టున రైతు నిలబడి, ఆవులను చెరులోకి తోలాడు. చెరువులో ఇటీవల ఎక్స్‌కవేటర్‌తో తీసిన గోతుల్లో ఆవులు చిక్కుకుని గిలాగిలా కొట్టుకుంటూ రైతు కళ్లెదుటే మృతి చెందాయి. ఇటీవల రూ.లక్ష వ్యయంతో కాడి ఆవులను కొను గోలు చేశానని, చెరువులో గోతులు తీసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసు కుని, తనకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు కోరాడు.

Updated Date - 2023-01-10T00:22:09+05:30 IST