Rains: ఉరుములు, మెరుపులతో వర్షం
ABN , First Publish Date - 2023-05-07T21:48:38+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district)లోని ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కరిగా ఉరుములు
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district)లోని ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కరిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఎల్లారెడ్డిపేట (Yellareddypet) మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇల్లంతకుంట మండలంలో భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగళ్లతోపాటు భారీగా ఈదురుగాలులు వీయడంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు నేలకొరిగాయి. మండలంలోని అనంతారంలో కొబ్బరిచెట్టుపై పిడిగు పడడంతో చెట్టు కాలిపోయింది. తాళ్లపెల్లి గ్రామంలోని మల్లన్నస్వామి ఆలయ ధ్వజస్తంభం గోపురం భారీ ఈదురుగాలులకు విరిగిపోయింది. నర్సక్కపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో షెడ్డు రేకులు కొట్టుకుపోయాయి. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన గుడిపాటి మోహన్‌రెడ్డి పొలం వద్ద పశువుల పాకలో పనిచేస్తుండగా ఉరుములతో కూడిన వర్షంతోపాటు పిడుగు పడింది. గేదె, ఎద్దు అక్కడిక్కడే మృతిచెందాయి. రైతు మోహన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానిక రైతులు చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.