ఘనంగా బీఆర్‌ఎస్ జెండా పండుగ
ABN , First Publish Date - 2023-04-25T23:48:18+05:30 IST
బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీల నేపథ్యంలో ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల్లో మంగళవారం బీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

ఆమనగల్లు/చౌదరిగూడ/నందిగామ/కొత్తూర్/కొందుర్గు/శంషాబాద్/ కేశంపేట/కందుకూరు, ఏప్రిల్ 25 : బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీల నేపథ్యంలో ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల్లో మంగళవారం బీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆమనగల్లు, కడ్తాలలో జరిగిన వేడుకల్లో ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరె డ్డి నారాయణరెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, అనురాధా పత్యనాయక్, ఎంపీపీలు కమ్లీమోత్యనాయక్, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు సీఎల్ శ్రీనివా్‌సయాదవ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ ముజుబుర్ రహమాన్, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు పొనుగోటి అర్జున్‌రావు, పత్యనాయక్, జైపాల్‌రెడ్డి, శంకర్, పరమేశ్, నాయకులు ఎండీ జహంగీర్, రంజిత్, గుత్తి బాలస్వామి, తదితరులున్నారు. చౌదరిగూడలో పార్టీ జెండావిష్కరణ అనంతరం బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు హఫీజ్ మాట్లాడుతూ 4కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు పుట్టిన ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని అన్నారు. షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగే ప్లీనరీకి బీఆర్‌ఎస్ నాయకులు తరలివెళ్లారు. సర్పంచ్‌లు బాబురావు, వెంకటస్వామి, గోపాల్‌రెడ్డి ,వెంకటేశ్, శేఖర్, ప్రేమ్‌కుమార్, రాములు, రాంచంద్రయ్య, సన్ని తదితరులున్నారు. నందిగామ మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌చైర్మన్ ఈట గణేష్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు జిల్లెల్ల వెంకట్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నోముల పద్మారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మున్సిపాలిటీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు. కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారాయణ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బాతుక లావణ్యదేవేందర్‌యాదవ్, వైస్ చైౖర్మన్ డోలీ రవీందర్, మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు కోస్గి భగవద్గీతశ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షుడు కృష్ణ, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులున్నారు. కేశంపేట మండలంతో పాటు అన్ని గ్రామాల్లో ఆయా గ్రామ కమిటీల అధ్యక్షులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌లకు మద్దతుగా నినాదాలు చేశారు. పాపిరెడ్డిగూడలో జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి తదితరులున్నారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో బీఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు దూడల వెంకటేశ్‌గౌడ్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ల చైతన్యపర్చాలన్నారు. మాజీ సర్పంచ్ ఆర్.గణేశ్ కౌన్సిలర్ స్రవంతీ శ్రీకాంత్‌రెడ్డి కార్యకర్తలు శ్రీనుగౌడ్, పవన్, రెడ్డి, సింహ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కొందుర్గు మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించారు. మండల పరిధిలోని శ్రీరంగాపూర్‌లో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ సాధిక్ జెండాను ఆవిష్కరించారు. షాద్‌నగర్ పట్టణంలో నిర్వహించిన ప్లీనరీకి కొందుర్గు మండలం నుంచి బీఆర్‌ఎస్ నాయకులు ఆధిక సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమాల్లో వైస్‌ఎంపీపీ రాజే్‌షపటేల్, సర్పంచ్ ఆదిలక్ష్మీ యాదయ్య, ఉపసర్పంచ్ రాజా రమే్‌షరెడ్డి, నాయకులు శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్, వేణుగోపాల్, యాదగిరి, ప్రభాకర్, వాసూరి, మాణేయ్య, గోపాల్, ప్రసాద్, ఇబ్రాహీం, లక్ష్మయ్య, రమేష్, బాల్‌రాజ్, బి రమే్‌షరెడ్డి, రవీందర్ యాదవ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీకి నేతలు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశానుసారం మండల శాఖ అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కందుకూరు మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ డి.చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు కె. రామకృష్ణారెడ్డి, జి.గోపాల్‌రెడ్డి, బాలమణి, రాంచంద్రారెడ్డి, బి.జ్యోతి, జి. కళమ్మ, మంద సాయిలు, శ్రీనివాసచారి, పరంజ్యోతి, శ్రీలత, నరేందర్‌గౌడ్, ఇందిరా దశరథ, శ్రీదేవిశేఖర్‌రెడ్డి, అనితాశ్రీనివాస్, ఎంపీటీసీలు ఇందిరా దేవేందర్, సురేష్, కాకి రాములు, లలితాకుమార్, నేతలు పాల్గొన్నారు.