Godavari Express ఘటనతో ఇవాళా, రేపు రద్దైన రైళ్ల వివరాలు..

ABN , First Publish Date - 2023-02-16T08:45:13+05:30 IST

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు నిన్న పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాక్ మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మరమ్మతు పనుల్లో కొన్ని వందల మంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను పాక్షికంగానూ.. మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేసింది.

Godavari Express ఘటనతో ఇవాళా, రేపు రద్దైన రైళ్ల వివరాలు..

Secunderabad : గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (Godavari Express) రైలు నిన్న పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాక్ మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మరమ్మతు పనుల్లో కొన్ని వందల మంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శాఖ పలు రైళ్లను పాక్షికంగానూ.. మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. ఏ ఏ రైళ్లను పాక్షికంగా.. అలాగే పూర్తిగా రద్దు చేసిందో తెలియజేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనను విడుదల చేసింది.

FpC5ZPTaAAAFf3M.jfif

కాగా.. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు వస్తుండగా మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌ వద్ద ఉదయం 6గంటలకు గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి అలాగే 400 మీటర్ల మేర ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో ఎస్‌4 నుంచి ఎస్‌1 వరకు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు, మరో రెండు జనరల్‌ బోగీలు కలిపి మొత్తంగా ఆరు బోగీలు అదుపు తప్పాయి. రైలు పెద్ద శబ్దంతో ఆగిపోవడం.. చుట్టూ దుమ్ముధూళి కమ్మేయడంతో ప్రయాణికులు ఏం జరిగిందో తెలియక భయంతో కేకలు వేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో పట్టాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

FpC5ZlNaIAExvMM.jfif

ఉదయం 8 గంటలకు రైల్వే అధికారులు, సిబ్బంది దాదాపు 400 మంది దాకా వచ్చి ఆరు బోగీలను రైలు నుంచి విడదీసి యంత్రాలతో మరమ్మతులు చేపట్టి సరి చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం తొమ్మిది రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. మరో 19 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు.. ఏడు రైళ్ల సమయాన్ని మార్చినట్లు.. మరో ఆరు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.

Updated Date - 2023-02-16T09:03:22+05:30 IST