అనధికార లేఅవుట్ల కట్టడికి చర్యలు
ABN , Publish Date - Jun 10 , 2024 | 11:19 PM
మదనపల్లె మున్సిపాలిటీలో నిబంధనలకు విరుధఽ్ధంగా ఉన్న అనధికార లేఅవుట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) వైస్ చైర్మన ఎం.బాబర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

పీకేఎం ఉడా వైస్ చైర్మన బాబర్
మదనపల్లె, జూన 10: మదనపల్లె మున్సిపాలిటీలో నిబంధనలకు విరుధఽ్ధంగా ఉన్న అనధికార లేఅవుట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) వైస్ చైర్మన ఎం.బాబర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం మదనపల్లె డీఎల్‌పీవో కార్యాలయంలో అనధికార లేవుట్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మండలంలోని పంచాయతీ కార్యదర్శు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ...గడిచిన రెండు, మూడు నెలలుగా ఎలక్షన విధులు కారణంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడా చూసినా ఇబ్బడిము బ్బడిగా అనధికార లేఅవుట్లు వేశారన్నారు. అటువంటి లేఅవుట్లును క్షేత్రస్థాయిలో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నిబం ధనలకు విరుధ్ధంగా వేసిన లేఅవుట్లు యజమానికి నోటీసులు ఇచ్చి ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకునేవిధంగా చూడాలన్నారు. ముఖ్యంగా ప్లాన లేకుండా నిర్మిస్తున్న పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టడి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎల్‌పీవో నాగరాజు, టౌన ప్లానింగ్ అధికారి కుమిదిని, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.