RAILWAY EMPLOYEES: హక్కుల కోసం అలుపెరగని పోరాటం
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:09 AM
రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు తమ యూనియన అలుపెరగని పోరాటాలు చేసిందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూరు యూనియన ప్రధాన కార్యదర్శి, అల్ ఇండియా రైల్వే ఫెడరేషన జాతీయ కోశాధికారి సీహెచ శంకర్‌రావు పేర్కొన్నారు.
గుత్తి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు తమ యూనియన అలుపెరగని పోరాటాలు చేసిందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూరు యూనియన ప్రధాన కార్యదర్శి, అల్ ఇండియా రైల్వే ఫెడరేషన జాతీయ కోశాధికారి సీహెచ శంకర్‌రావు పేర్కొన్నారు. స్థానిక రైల్వే డీజిల్ షెడ్‌లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం షెడ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. డిసెంబరు 4నుంచి మూడు రోజుల పాటు జరిగే గుర్తింపు రైల్వే సంఘాల ఎన్నికల్లో మజ్దూరు యూ నియన జెండా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం సీఅండ్ డబ్ల్యు, కంట్రోలర్ లాబీ, రైల్వేస్టేషన తదితర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పత్తికొండ రోడ్డు సర్కిల్‌లో మజ్దూరు యూనియన నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడ జ్యోతిరావుపూలే, అం బేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి డీజిల్ షెడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డివిజనల్ సెక్రెటరీ విజయ్‌కుమార్, కోశాధికారి శర్మ, ఏడీఎస్ నారాయణ, మజ్దూరు యూ నియన నాయకులు నారాయణ, శేఖర్‌బాబు, రామాంజనేయులు రెడ్డి, మనోహర్, నరసింహ, సుదీర్, విశ్రాంతఅసోసియేషన కార్యదర్శి మస్తానవలి పాల్గొన్నారు.