GURU POURNAMI : ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
ABN , Publish Date - Jul 21 , 2024 | 11:54 PM
గురుపౌర్ణమిని ఆదివారం భక్తులు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి, షిర్డీసాయిబాబా మందిరాల్లో అర్చకులు ఉదయం మూలవిరాట్లకు వివిధ రకాల అభిషేకాలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. అర్చనలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి దత్తాత్రేయుడి ని, బాబాను దర్శించుకున్నారు. పలు మందిరాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
హిందూపురం అర్బన/ హిందూపురం(పరిగి) :గురుపౌర్ణమిని ఆదివారం భక్తులు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి, షిర్డీసాయిబాబా మందిరాల్లో అర్చకులు ఉదయం మూలవిరాట్లకు వివిధ రకాల అభిషేకాలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. అర్చనలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి దత్తాత్రేయుడి ని, బాబాను దర్శించుకున్నారు. పలు మందిరాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. హిందూపురంలోని నానెప్పనగర్ షిర్డీసాయి ఆలయంలో బాబా వెండి సింహాసనంపై బంగారు కిరరీటంతో దర్శనమిచ్చారు. సత్యనారాయణ పేటలోని శేషసాయి ఆలయం, హౌసింగ్‌మోడ్డు కాలనీ బాబా మందిరం, మిట్టమీదపల్లి, పరిగిలోని షిర్టీ సాయిబాబా ఆలయం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
పెనుకొండ / పెనుకొండ రూరల్/ టౌన: పట్టణంలోని దక్షిణ షిర్డీ గా పేరు గాంచిన షిర్డీసాయిబాబా మందిరం, ఆల్విన కాలనీలోని షిర్డీ సా యి, సత్యసాయి భజన మంది రాల్లో ఉదయం ప్రత్యేక పూజలు, హో మా లు నిర్వహించారు. సాయంత్రం అఖండ సాయినామ సంకీర్తన చేప ట్టా రు. పెనుకొండ మండల వ్యాప్తంగా షిర్డీసాయి ఆలయాల్లో గురుపౌర్ణమిని జరుపుకున్నారు. గుట్టూరు, దుద్దే బండ క్రాస్‌లో వెలసిన సాయిబాబాకు భక్తులు పట్టువస్త్రాలు సమర్పించారు. గుట్టూరులో పుట్టపర్తి సాయి ట్రస్ట్ ఆద్వర్యంలో సత్యసాయి చిత్రపటాన్ని పల్లకిలో ఊరేగించారు.
గోరంట్ల/లేపాక్షి/చిలమత్తూరు/హిందూపురం(సోమందేపల్లి): గోరంట్లలోని వినాయక్‌నగర్, బూడిదగడ్డపల్లి షిర్డీసాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే లేపాక్షి, చిలమత్తూరు, సోమందే పల్లి షిర్డీసాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
మడకశిరటౌన/ మడకశి(అమరాపురం): మడకశిర పట్టణంలోని షిర్డీసాయి ఆలయంలో విశేష పూజలు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దంపతులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి దంపతు లు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న, వైసీపీ సమన్వయ కర్త ఈరలక్కప్ప తదితరులు బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఆవరణంలో టీడీపీ డాక్టర్ సెల్ అధ్యక్షుడు కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అలాగే అమరాపు రంలోని షిర్డీసాయి మందిరం, మండల పరిధిలోని హేమావతి గ్రామంలో వెలసిన దత్తాత్రేయ ఆశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వరస్వామి ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పావగడ: పట్టణంలోని నంజుండప్ప లేఅవుట్‌లో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయం, ఆదర్శనగర్‌లోని శ్రీకంఠేశ్వర, భంభం స్వామి ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....