YSRCP: ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్
ABN , Publish Date - Apr 23 , 2024 | 10:56 AM
ఎక్కడికక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి ఎవరికి నచ్చిన పార్టీలో వారు జాయిన్ అవుతున్నారు. షెడ్యూల్ రావడానికి మునుపే వైసీపీ ముఖ్య నేతలు చాలా మంది అధిష్టానం వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేసేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇలా జాయిన్ అయిన వారిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారు.
అనంతపురం: ఎక్కడికక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి ఎవరికి నచ్చిన పార్టీలో వారు జాయిన్ అవుతున్నారు. షెడ్యూల్ రావడానికి మునుపే వైసీపీ (YSRCP) ముఖ్య నేతలు చాలా మంది అధిష్టానం వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేసేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇలా జాయిన్ అయిన వారిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు కిందిస్థాయి నేతల వంతు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సమక్షంలో 40 మంది దాకా జాయిన్ అయ్యారు. కీలక నేతలకు సైతం హ్యాండ్ ఇచ్చి కింది స్థాయి నేతలు పార్టీ మారుతున్నారు.
కార్పొరేట్ విద్య.. ఇదేనా జగన్..?
ఇక సత్యసాయి జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కురబ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వైసీపీకి చెందిన కోటి సూర్యప్రకాశ్ బాబు రాజీనామా చేశారు. బత్తలపల్లి జడ్పీటీసీ కోటి సుధ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరనున్నారు. వైసీపీలో తమకు అన్యాయం జరిగిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే పార్టీ మారాలని భావిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి ఎన్నికల ముందు వైసీపీకి ఝలక్‌ల మీద ఝలక్‌లు తగులుతున్నాయి.
AP Elections: పెందుర్తిలో పాగా వేసేదెవరు..?
Read More AP News and Telugu news