వైభవంగా సంకటహర గణపతి వ్రతం
ABN , Publish Date - Feb 29 , 2024 | 12:38 AM
కాణిపాక ఆలయంలోని ఆస్థాన మండపంలో బుధవారం ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా సంకటహర గణపతి వ్రతాన్ని భక్తులు నిర్వహించారు.

స్వర్ణరథంపై విహరించిన వినాయకుడు
ఐరాల(కాణిపాకం)ఫిబ్రవరి 28: కాణిపాక ఆలయంలోని ఆస్థాన మండపంలో బుధవారం ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా సంకటహర గణపతి వ్రతాన్ని భక్తులు నిర్వహించారు. పౌర్ణమి గడచిన నాలుగవ రోజున ఈ వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లను స్వర్ణరథంపై ఉంచి మాడవీధులలో ఊరేగించారు. మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె దీపావెంకట్, ఈవో వెంకటేశు, పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జి మురళీమోహన్, రాయలసీమ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ రీజినల్ చైర్‌పర్సన్ శైలజాచరణ్‌రెడ్డి, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.