Srinivasananda: జగన్ ప్రభుత్వంలో వ్యాపార కేంద్రంగా తిరుమల
ABN, Publish Date - Jul 10 , 2024 | 08:00 PM
గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో తిరుమల పవిత్రత దెబ్బతిన్నదని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి (Srinivasananda Saraswati) తెలిపారు.
తిరుమల: గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో తిరుమల పవిత్రత దెబ్బతిన్నదని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి (Srinivasananda Saraswati) తెలిపారు. జగన్ ప్రభుత్వంలో తిరుమల వ్యాపార కేంద్రంగా మారిపోయిందని మండిపడ్డారు. ఈరోజు (బుధవారం) తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని చెప్పారు.
గతంలో అన్నదానంలో అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే అన్నప్రసాదం ఏ మాత్రం బాగాలేదన్నారు. పశువులకు పెట్టే విదంగా అన్నం ఉందని విమర్శించారు. అన్నం బాగోలేదన్న విషయాన్ని అన్నప్రసాదం అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. నేడు అన్నప్రసాదం స్వీకరిస్తే అన్నప్రసాదం బాగుందని వివరించారు. ఇకపై ప్రతి రోజు కూడా అన్నప్రసాదాని ఇలానే వడ్డీంచాలని ప్రభుత్వాన్ని శ్రీనివాసానంద సరస్వతి కోరారు.
Updated Date - Jul 10 , 2024 | 08:00 PM