ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu Issue: తిరుపతి లడ్డూను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసింది: బుచ్చిరాం ప్రసాద్

ABN, Publish Date - Sep 22 , 2024 | 03:16 PM

పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ ఆరోపణలు చేశారు. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా తిరుమలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. జగన్ భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు.

Sri Buchi Ram Prasad

అమరావతి: వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో సరైన నాణ్యత పాటించలేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో పటిష్ఠ చర్యలు చేపడుతోందని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు. తిరుమల లడ్డూలో నాణ్యత లేదని తాము గతంలో చాలా సార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీకుసువచ్చామని గుర్తుచేశారు.


తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు కలుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపితే వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తారా? అని ప్రశ్నించారు. నాన్ వెజ్ తిననివారు తెలియక తినేస్తే ఏం చేయాలో తెలుసుకుని సరిదిద్దుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూలు నాణ్యతగా ఉండటం చూస్తున్నామని తెలిపారు.


పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఆరోపణలు చేశారు. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా తిరుమలకువెళ్లారా? అని ప్రశ్నించారు. జగన్ భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. ఆగమ శాస్త్రం తెలిసినవారు జంతువుల కొవ్వు నెయ్యితో తయారు చేసిన లడ్డూ (ప్రసాదం) తింటే దోషం ఎలా పోతుందో తెలపాలని అన్నారు. తిరుమలలో వైసీపీ నాయకులు చాలా తప్పులు చేశారని.. వారిని వదలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని బుచ్చిరాం ప్రసాద్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌పై బీజేపీ నేత ఫైర్.. చర్చకు సిద్ధమా..

జగన్, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే..

పవన్ కల్యాణ్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 22 , 2024 | 03:50 PM