Pawan Kalyan: టీటీడీ కీలక నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Nov 18 , 2024 | 10:03 PM
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సోమవారం తిరుమలలో సమావేశమైంది. ఈ సందర్భంగా పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటైన తిరుపతి ప్రజలకు.. శ్రీవారిని దర్శించేందుకు ప్రతి నెలలో ఒక రోజు కేటాయించేందుకు టీటీడీ సుముఖత వ్యక్తం చేసింది.
అమరావతి, నవంబర్ 18: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అందులో భాగంగా మరో హామీని తాజాగా అమలు చేస్తోంది. తిరుపతి నగర ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఇక తిరుపతి ప్రజల్లో అయితే ఆనందం వెల్లువిరిస్తోంది.
Also Read:MP Sri Bharath: యూఎస్ అధ్యక్షుడుగా ఎవరు వచ్చినా..
అలాంటి వేళ.. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తిరుపతి నగర ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ హామీని నెరవేరుస్తామని.. తాను హామీ ఇచ్చానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకు వెళ్లి పరిశీలించాలని సూచించానన్నారు.
Also Read: Maharashtra Elections: మహాయుతిదే విజయం
Also Read: బీజేపీ అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం
Also Read: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి
దీంతో టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ.. ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Vemuri Radha Krishna: తెలుగు రాష్ట్రాలను ఇంగ్లీష్ అనే వ్యామోహం కమ్మేసింది
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సోమవారం తిరుమలలో సమావేశమైంది. టీటీడీ పాలక మండలి ఏర్పాటు అయిన తర్వాత తొలి సారిగా నేడు సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులోభాగంగా శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది.
Also Read: కేసీఆర్‌ను మించిన నియంతలా రేవంత్
Also Read: కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన హరీశ్ రావు
Also Read: నిమ్మకాయలతో ఇన్ని లాభాలున్నాయా..?
శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మారుస్తున్నట్లు ప్రకటించింది. అలిపిరిలో దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమి.. టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఏడుకొండల వాడు కొలువు తీరిన తిరుమల పరిసర ప్రాంతాల్లో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకుంది. తొలి సమావేశంలోనే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకు రావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి సంతోషం వ్యక్తమవుతుంది.
For AndhraPradesh News And Telugu News