ఎట్టకేలకు సొంత భవనాల్లోకి..
ABN , Publish Date - Nov 07 , 2024 | 12:09 AM
గొల్లప్రోలు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు పాపయ్యచావిడి వీధిలో గల మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరగతి గదుల్లోకి బుధవారం వచ్చిన విద్యార్థుల ఆనందానికి అంతు లేకుండాపోయింది. కొత్త తరగతి గదులు, నూతన బెంచీలు చూసి వారు మురి
విద్యార్థుల ఆనందోత్సాహాలు
గొల్లప్రోలు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు పాపయ్యచావిడి వీధిలో గల మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరగతి గదుల్లోకి బుధవారం వచ్చిన విద్యార్థుల ఆనందానికి అంతు లేకుండాపోయింది. కొత్త తరగతి గదులు, నూతన బెంచీలు చూసి వారు మురిసిపోయారు. గొల్లప్రోలు పట్టణంలోని పాపయ్యచావిడి రామకోవెల సమీపంలో ఉన్న మండలపరిషత్ ప్రాధమిక పాఠశాల నెంబరు-2 భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించి నాడు-నేడు కింద నూతన భవనాలను వైసీపీ హయాంలో నిర్మించారు. అయితే పనులు పూర్తి చేయకపోగా, ఫర్నీచర్ ఇతర సౌకర్యాలు కల్పించలేదు. దీంతో గత ఐదేళ్లుగా ఈ పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల్లోని ఒక తరగతి గదిలోనే సర్దుకుని విద్యను అభ్యసించాల్సి వచ్చేది. వరండాల్లో తరగతులు నిర్వహించారు. ఫలితం గా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్ తన ఓఎస్‌డీ మధుసూదన్‌ను పంపించి పాఠశాలల పరిస్థితులపై పరిశీలన చేయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పవన్ తక్షణం స్పందించి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. కలెక్టర్ సీఎస్‌ఆర్ నిధు లు మంజూరు చేయడంతో పాఠశాల నూతన భవనాలకు రంగు వేయడంతో పాటు ఫర్నీచర్, ఇతర సౌకర్యాలను కల్పించారు. సోమవారం ఈ పాఠశాల భవనాలను పవన్ ప్రారంభించగా బుధవారం విద్యార్థులను తరగతి గదుల్లోకి పం పారు. విశాలమైన తరగతి గదులు, ఫర్నీచర్ ఇ తర సౌకర్యాలు చూసి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. పవన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.