Share News

ఇంకెన్నాళ్లో?

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:02 AM

కాకినాడసిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఎన్నో అడ్డంకులు.. అవరోధాలు. ఎట్టకేలకు వాటిని అధి గమించి కాకినాడ నగరంలోని కొండయ్యపాలెం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూ

ఇంకెన్నాళ్లో?
కాకినాడ నగరంలోని కొండయ్యపాలెంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి

కొండయ్యపాలెంలో ఆర్‌వోబీ నిర్మాణం

సర్వీస్‌ రోడ్లు వదిలేసిన వైనం

కాకినాడసిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఎన్నో అడ్డంకులు.. అవరోధాలు. ఎట్టకేలకు వాటిని అధి గమించి కాకినాడ నగరంలోని కొండయ్యపాలెం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేశారు. కానీ ఈ బ్రిడ్జి దిగువ ఇరువైపులా సర్వీస్‌ రోడ్లను ని ర్మించకపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందు లు తప్పడంలేదు. 2008లో శంకుస్థాపన చేసిన కొండయ్యపాలెం ఆర్వోబీ 2024లో పూర్తయి వా డుకలోకి వచ్చింది. కొండయ్యపాలెం ఆర్వోబీ మినీ బైపాస్‌ రోడ్డుగా కూడా వాడుకలోకి వచ్చింది. ఈలోగా ముగ్గురు ఎమ్మెల్యేలు మారారు. ఇటు రామారావుపేట వైపు సర్వీస్‌ రోడ్లు, అటు కొండ య్యపాలెం వైపు సర్వీస్‌ రోడ్లను గ్రావెల్‌ రోడ్లుగా వదిలేశారు. దీంతో ఈ సర్వీస్‌ రోడ్ల వెంబడిగల ఇళ్ల యజమానులు రాకపోకలకు నానాయాతన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ మట్టి రోడ్లపై పెద్ద పెద్దగోతులు ఏర్పడ్డాయి. దీం తో ఆయా ప్రాంతాల ప్రజలు రబ్బిస్‌తో గోతులు పూడ్చి రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ ద్వారా ఈ చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి భూ సేకరణ పరిహారంపై సమస్య తలెత్తింది. దీన్ని అధిగమించేసరికి నిధుల సమస్య ఎదురైంది. దీం తో కార్పొరేషన్‌ నిధులు వెచ్చించి నిర్మాణ పనులు పూర్తి చేయించారు. నిధుల లేమితో కొండయ్య పాలెం వైపు రెండు సర్వీస్‌ రోడ్లను నిర్మించలేదు. రామారావుపేట వైపు సర్వీస్‌ రోడ్లలో తూర్పు వైపు భూసేకరణ పరిహారం కొలిక్కి రాక న్యా యస్థానంలో ఉంది. దీనిపై కూటమి ప్రజాప్రతి నిధులు దృష్టిసారించి సర్వీసు రోడ్లను అందుబా టులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 26 , 2024 | 12:02 AM