ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh: పసుపు అడ్డాలో పట్టు ఎవరిదో?

ABN, Publish Date - Apr 26 , 2024 | 02:11 PM

Gudivada Politics: విదర్భపురిగా.. అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడది. ఒకప్పుడు కృష్ణా జిల్లా(Krishna District) రాజకీయం అంతా గుడివాడ(Gudivada) చుట్టూనే తిరిగేదంటారు. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు ఈ గడ్డ. టీడీపీ(TDP) ఆవిర్భావం నుంచి ఏడుసార్లు నెగ్గి అభివృద్ధికి బాటలు వేసి గుడివాడ పేరును..

Gudivada

  • 10 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీదే గెలుపు

  • కొడాలి నాని 2 సార్లు గెలిచింది టీడీపీ జెండాతోనే

  • వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్న నానికి ఎదురుగాలి

  • గుడులవాడను జూదవాడగా మార్చాడని జనాగ్రహం

  • ప్రముఖుల పుట్టినింట కేసినో సంస్కృతిని తెచ్చిన ఘనత నానిదే

Gudivada Politics: విదర్భపురిగా.. అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడది. ఒకప్పుడు కృష్ణా జిల్లా(Krishna District) రాజకీయం అంతా గుడివాడ(Gudivada) చుట్టూనే తిరిగేదంటారు. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు ఈ గడ్డ. టీడీపీ(TDP) ఆవిర్భావం నుంచి ఏడుసార్లు నెగ్గి అభివృద్ధికి బాటలు వేసి గుడివాడ పేరును రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేసింది. వైసీపీ(YSRCP) రెండుసార్లు నెగ్గి కేసినోకు కేంద్రంగా చేసి చెడ్డ పేరును తీసుకొచ్చింది. పచ్చని పొలాలు, చెరువు గట్టులతోపాటు శుభకార్యాలకు నెలవులైన కల్యాణమండపాలను సైతం జూదగృహాలుగా మార్చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ, వైసీపీ తలబడుతున్నాయి. ఈసారి అభివృద్ధివైపు నిలబడలా? అరాచకానికి బలవ్వాలా? అనేది ప్రజలు కొద్దిరోజుల్లో నిర్ణయించనున్నారు.


అపకీర్తితో నానికి ఎదురుగాలి..

భారతదేశంలో రెండోది, దక్షిణ భారతదేశంలోనే మొదటి హోమియో కాలేజీ గుడివాడలో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే హోమియో రీసెర్చ్‌ సెంటర్‌ ఉంది. వ్యవసాయ పరికరాల తయారీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గుడివాడ అగ్రగామి అటేవంటి కేంద్రాన్ని 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలకు అడ్డాగా మార్చేసింది. ఎందరో మధ్యతరగతి జీవుల జీవితాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు ధనికులనూ రోడ్డుపాలు చేస్తున్న ఘనత గుడివాడ ఖాతాలో చేరింది. స్థానిక ప్రజాప్రతినిధి కొడాలి నాని అండతో ఆయన అనుచరులు విచ్చలవిడిగా పేకాటలు, గుండాటలు వంటివి నిర్వహిస్తున్నారు. నాని రాష్ట్ర మంత్రిగా చేశారు. జూద గృహాల నిర్వహణ అంతా ఆయన అనుచరుల కనుసన్నల్లోనే నడిచేవి. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం కన్నా ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడానికే ప్రాధాన్యం ఇచ్చారు.


సమస్యల్ని పట్టించుకోని ప్రజాప్రతినిధిగా..

ఇసుక రీచ్‌ల్లో దోపిడీతో కోట్లు కొల్లగొట్టడంపై ఎమ్మెల్యే నాని దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యతోపాటు రహదారుల సమస్య తీవ్రంగా ఉన్నా ఏనాడూ పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో పూర్తి చేసుకున్న టిడ్కో ఇళ్లను ఐదేళ్లపాటు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎన్నికల ముందు స్టంట్‌లో భాగంగా సీఎం జగన్‌తో ప్రారంభించి హడావిడి చేశారు. ఇలాంటివెన్నో నానికి ప్రతికూలంగా మారనున్నాయి. దీంతో ఈసారి ఆయన గెలుపు అనుమానమేనని సొంత పార్టీ వారే చెబుతున్న మాట.


ఎందరో మహానుభావులు..

గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ, మున్సిపాల్టీతోపాటు, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలున్నాయి. ఎందరెందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి దేశ విదేశాల్లో కీలకమైన కొలువులు చేపట్టి తమ ప్రాంతానికి వన్నెలద్దారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో గుడివాడకు చెందిన గూడూరి రామచంద్రుడు హరిజనాశ్రమం నిర్మించారు. పాత గుడివాడ నియోజకవర్గం పరిధిలోని పామర్రు మండలం నిమ్మకూరు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వగ్రామం. పద్మశ్రీ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుది నందివాడ మండలం వెంకటరాఘవాపురం. గానగాంధర్వ ఘంటసాల వెంకటేశ్వర రావుది చౌటపల్లి గ్రామం. కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరిది గుడ్లవల్లేరు మండలం అంగలూరు. సినీఫొటోగ్రఫీ దిగ్గజం వి.ఎస్‌.ఆర్‌.స్వామిది గుడివాడ మండలం వలివర్తిపాడు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ స్వగ్రామం. సినీపాటలకు సాహిత్య శోభను అద్దిన జాలాది గుడివాడ నియోజకవర్గవాసే. దేశ విద్యుత్తు రంగానికి వెన్నెముకలా నిలిచిన నార్ల తాతారావు, ప్రముఖ పాత్రికేయుడు, కవి నార్ల వెంకటేశ్వరరావు గుడివాడ నియోజకవర్గంలోని కౌతరంలో జన్మించినవారే. ఉయ్యూరు కేసీపీ షుగర్స్‌ సంస్థ వ్యవస్థాపకుల్లో గుడివాడకు చెందిన అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య ముఖ్యులు. ఇలా మరెందరో మహామహులను అందించిన నియోజకవర్గంగా గుడివాడ కీర్తికెక్కింది.


ఎన్టీఆర్‌తో మొదలై..

ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు జన్మించింది ఒకప్పటి గుడివాడ నియోజకవర్గంలోని నిమ్మకూరులోనే. సొంత ఊరిపై మమకారంతో 1983లో ఆయన తన రాజకీయ అరంగేట్రానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్నే కార్యశాలగా ఎంచుకున్నారు. 1985లోనూ ఎన్టీఆర్‌ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన హయాంలో గుడివాడ రూపురేఖలు మారాయి. అందమైన రహదారులతోపాటు క్రీడాప్రియుల కోసం ఎన్టీఆర్‌ స్టేడియంను నిర్మించారు. 1983 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీకి పట్టం కట్టారు. ఒకే ఒక్కసారి కాంగ్రెస్‌ గెలవగా రెండుసార్లు వైసీపీ గెలుపొందింది. సిటింగ్‌ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు టీడీపీ నుంచి రెండు సార్లు వైసీపీ నుంచి గెలుపొందిన ఆయన ఈసారి కూడా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము పోటీలో ఉన్నారు.


పక్కా వ్యూహంతో టీడీపీ..

ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌పై బూతులతో దాడులు చేస్తున్న నాని విషయంలో టీడీపీ అధిష్టానం కూడా సీరియస్‌గా ఉంది. వెనిగండ్ల రాముకి టీడీపీ టికెట్‌ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు టికెట్‌ ఆశించిన రావి వెంకటేశ్వరరావు సైతం రాముకి మద్దతుగా నిలిచారు. ఎటువంటి పొరపొచ్చాలూ లేకుండా ప్రతి కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ప్రచారంలోనూ అదేస్థాయిలో దూసుకుపోతున్నారు. పిన్నమనేని వర్గం సైతం రాముకి మద్దతుగా నిలవడం అదనపు బలం. ఈసారి ఎలాగైనా గుడివాడలో పసుపు జెండా ఎగురవేయాలన్న కసితో టీడీపీ శ్రేణులు కదనరంగంలో దూసుకుపోతున్నాయి.


నియోజకవర్గంలో పార్టీల గెలుపోటములు..

  • 1978 - కఠారి సత్యనారాయణ -కాంగ్రెస్‌-(విజేత), పుట్టగుంట సుబ్బారావు, సీపీఎం-(సమీప ప్రత్యర్థి)

  • 1983 - నందమూరి తారక రామారావు-టీడీపీ-(విజేత), కఠారి సత్యనారాయణ, కాంగ్రెస్‌-(సమీప ప్రత్యర్థి)

  • 1985 నందమూరి తారకరామారావు-టీడీపీ-(విజేత), ఉప్పలపాటి సూర్యనారాయణ, కాంగ్రెస్‌-(సమీప ప్రత్యర్థి)

  • 1989 కఠారి ఈశ్వర్‌కుమార్‌-కాంగ్రెస్‌-(విజేత), రావి శోభనాద్రిచౌదరి, టీడీపీ-(సమీప ప్రత్యర్థి)

  • 1994 రావి శోభనాద్రిచౌదరి-టీడీపీ-(విజేత), కఠారి ఈశ్వర్‌కుమార్‌, కాంగ్రెస్‌-(సమీప ప్రత్యర్థి)

  • 1999 రావి హరిగోపాల్‌-టీడీపీ-(విజేత), కఠారి ఈశ్వర్‌కుమార్‌, కాంగ్రెస్‌-(సమీప ప్రత్యర్థి)

  • 2000 రావి వెంకటేశ్వరరావు (ఉప ఎన్నిక)-టీడీపీ-(విజేత), శేగు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌-(సమీప ప్రత్యర్థి)

  • 2004 కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)-టీడీపీ-(విజేత), కఠారి ఈశ్వర్‌కుమార్‌, కాంగ్రెస్‌-(సమీప ప్రత్యర్థి)

  • 2009 కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)-టీడీపీ-(విజేత), పిన్నమనేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌-(సమీప ప్రత్యర్థి)

  • 2014 కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)-వైసీపీ-(విజేత), రావి వెంకటేశ్వరరావు, టీడీపీ-(సమీప ప్రత్యర్థి)

  • 2019 కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)-వైసీపీ-(విజేత), దేవినేని అవినాశ్‌, టీడీపీ-(సమీప ప్రత్యర్థి)

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2024 | 02:11 PM

Advertising
Advertising