Janasena: ‘విజయవాడ వెస్ట్‌లో నేనే లోకల్’.. పోతిన నిరాహార దీక్ష
ABN , Publish Date - Mar 25 , 2024 | 11:54 AM
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం సీటును కేటాయించాలంటూ పోతిన మహేష్ సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ‘‘కూటమి లో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసాం నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆణువణువూ నాకు తెలుసు. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చిన వైసీపీతో పోటీ పడలేరు’’ అని అన్నారు.
అమరావతి, మార్చి 25: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ అంశంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ టికెట్‌పై జనసేన నేత పోతిన వెంకట మహేష్ (Janasena Leader Potina Venkata Mahesh) మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తులో (TDP-Janasena-BJP) భాగంగా పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఎవరికి వెళ్తుంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీ నుంచి జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ తనకే అంటూ పోతిన మహేష్ బహిరంగంగానే చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి జనసేన పెద్దల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంపై జనసేన నేత ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
AP News: అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం..
ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గం సీటును కేటాయించాలంటూ పోతిన మహేష్ సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ‘‘కూటమి లో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసాం నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆణువణువూ నాకు తెలుసు. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చిన వైసీపీతో పోటీ పడలేరు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వేరే నియోజకవర్గానికి పంపించిది మా పోరాటం వల్లే. నాకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ రెండవ లిస్ట్‌లో నా పేరు ఉంటుంది అని చెప్పారు. చెప్పడం వల్లే నా దూకుడు పెంచాను. పశ్చిమ నియోజకవర్గం ప్రజలు నాకు సీటు ఇవ్వడమే న్యాయమని అంటున్నారు’’ అని పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Purandeswari: ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నేతలతో పురందేశ్వరి సమావేశం..
Kerala: వయనాడ్ నుంచి రాహుల్‌తో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..