ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: ఎన్నికల కమిషన్ ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలి: కనకమేడల రవీంద్ర కుమార్

ABN, Publish Date - May 17 , 2024 | 07:51 PM

రాష్ట్రంలో పోలింగ్‌ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ (Kanakamedala Ravindra Kumar) కోరారు.

Kanakamedala Ravindra Kumar

అమరావతి: రాష్ట్రంలో పోలింగ్‌ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ (Kanakamedala Ravindra Kumar) కోరారు. ఒకవైపు ఈసీ రాష్ట్ర ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా... మరోవైపు అధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కొందరు స్థానిక పోలీసులు ఇంకా సహకారం అందిస్తున్నారని చెప్పారు.

తాడిపత్రితో తనకు సంబంధం లేకపోయినా... రాజంపేట డీఎస్పీ చైతన్య చేస్తున్న అక్రమ దాడులపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పందించి వెంటనే తగిన యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్‌ రోజు నుంచి అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా... కేవలం మూడు నాలుగు ప్రాంతాల్లోనే అల్లర్లు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారని మండిపడ్డారు.


ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశానికి ఓటు వేశారని వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారు... వారిపై తక్షణం క్రిమినల్‌ కేసులు నమోదు చేసి... నిందితులను అరెస్టు చేయాలని కోరారు. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడంతో సరిపెట్టకుండా ఇరువురిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఇచ్చిన చాలా ఫిర్యాదులపై ఈసీ సమయానుకూలంగా స్పందించి ఉంటే... కొంత వరకు వైసీపీ దౌర్జన్యాన్ని నివారించగలిగే వారని తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరపడంలో అధికార యంత్రాంగం విఫలం అవ్వడానికి కారణమన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ విషయంలో పలు అంశాల్లో సీఎస్‌ ద్వారా జోక్యం చేసుకోవడమేనని చెప్పారు.


పల్నాడు జిల్లాలో మారణాయుధాలతో అధికార వైఎస్సార్సీపీ నేతలు, గూండాలు నడిరోడ్డుపై పరేడ్ చేసినా, దాడులు చేస్తారనే సమాచారం ఇచ్చినా.... పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు స్పందించపోవడం అంటే.... ప్రభుత్వమే హింసను ప్రోత్పహించినట్లుగా కనిపిస్తోందన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు... పల్నాడులో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతోపాటు... కేంద్ర బలగాల సంఖ్య పెంచాలని కోరారు. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి తరహా... హింసాత్మక ఘటనలు, తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతి పరులపై దాడులు విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని కనకమేడల రవీంద్ర కమార్ కోరారు.


ఇవి కూడా చదవండి...

Elections 2024: వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు

Raghurama: కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామకృష్ణంరాజు

AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట

Updated Date - May 17 , 2024 | 07:53 PM

Advertising
Advertising