ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: మిగిలింది 10 రోజులు.. తమవైపు తిప్పుకునేందుకు నేతల యత్నాలు..

ABN, Publish Date - May 02 , 2024 | 09:46 AM

ఏపీలో పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. సరిగ్గా ప్రచారం ముగియడానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటినుంచి మరో ఎత్తు అన్నట్లు ఉండనున్నాయి రాజకీయ పార్టీల వ్యూహ.. ప్రతి వ్యూహాలు. గెలుపు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు శ్రమిస్తున్నాయి.

AP Elections

ఏపీలో పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. సరిగ్గా ప్రచారం ముగియడానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటినుంచి మరో ఎత్తు అన్నట్లు ఉండనున్నాయి రాజకీయ పార్టీల వ్యూహ.. ప్రతి వ్యూహాలు. గెలుపు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు తమ మద్దతు ఎవరికి అనేదానిపై బహిరంగ ప్రకటనలు చేశాయి. మరికొంతమంది పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతు పలుకుతున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల ప్రచార వేగాన్ని పార్టీలు పెంచాయి.


ఇప్పటికే సర్వే సంస్థలు ఇస్తున్న నివేదికల ప్రకారం.. ఫలితాన్ని తమవైపు మార్చుకునేందుకు ఏం చేయాలనేదానిపై పార్టీలు వ్యూహాలు సిద్ధం చేశాయి. అధికారపార్టీ నాయకులు మాత్రం ముఖ్యంగా ఓట్లకు నోట్లు పంచడం ద్వారా గెలుపు అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారట. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువుగా ఉండటంతో.. ఈ 10 రోజుల్లో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎంత మేర తగ్గించగలం.. ఏ విధంగా తగ్గించగలం అనే అంశాపై నాయకులు కసరత్తు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఎంత ఓటు బ్యాంకు ఉంది.. వ్యతిరేకంగా ఎంత ఓటు బ్యాంకు ఉంది.. గత ఎన్నికల్లో వచ్చిన పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతాన్ని చూసుకుంటూ.. ఈ ఎన్నికల్లో ఏమేర ఓట్లు వస్తాయనేదానిపై అభ్యర్థులు ఓ అంచనా వేసుకుంటున్నారు.

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌


ఓటర్ల లిస్ట్‌లతో కుస్తీ..

దాదాపు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాల వారీ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి.. ఓటర్ల జాబితాతో కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయాల్లో స్పెషల్ టీమ్‌లు పెట్టి.. ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి.. అందులో తమకు పాజిటివ్ ఎన్ని.. నెగిటివ్ ఎన్ని.. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న వర్గాలు ఏమిటి.. ఆ వర్గం ఓట్ల శాతం ఎంత.. యువత ఓట్లు ఎన్ని ఉన్నాయి.. వారు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారనేదానిపై లెక్కులు తీస్తున్నట్లు తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాల జాబితాను సిద్ధం చేసి.. కుల పెద్దలను సంప్రదించి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.


కులాలవారీ ప్యాకేజీలు.. అధికారపార్టీ కుట్ర..

రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లుగా ఉన్న సామాజిక వర్గాలు వైసీపీపై వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలు వెలవడటంతో వైసీపీ జాగ్రత్త పడింది. సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయగలిగే వ్యక్తులను గుర్తించి.. వారితో వైసీపీ సీనియర్లు నేరుగా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కుల పెద్దలకు భారీ స్థాయిలో ప్యాకేజీలు ఇస్తూ.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్నారనే విమర్శలను వైసీపీ నేతలు ఎదుర్కింటున్నారు. మరోవైపు తమను గెలిపిస్తే కుల సంఘాలకు భవనాలు కట్టిస్తామని, ఇప్పటికే ఉన్న భవనాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారట. సమయం తక్కువుగా ఉండటంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలను రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనేది జూన్4న తేలనుంది.


నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read Latest AP News and Telugu News

Updated Date - May 02 , 2024 | 10:18 AM

Advertising
Advertising