AP Elections2024: చంద్రబాబును కలిసిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు
ABN, Publish Date - May 30 , 2024 | 04:06 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు (Nomula Manikyala Rao) పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు (Nomula Manikyala Rao) పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.
ఈరోజు(గురువారం) హైదరాబాద్‌లో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడును (Narachandrababu Naidu) తన నివాసంలో కలిశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి మరింత కక్షగట్టారని చంద్రబాబుకు మాణిక్యాలరావు వివరించారు.
ఎమ్మెల్యే, అతని సోదరుడు తనను, తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తలదాచుకున్నానని అన్నారు. పిన్నెల్లి చేతిలో తనకు ప్రాణహాని ఉందని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు కూడా మొరపెట్టుకున్నానని వాపోయారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాణిక్యాలరావు పోరాటాన్ని చంద్రబాబు అభినందించారు.
AP Politics: సీఎస్ జవహర్ రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన జనసేన నేత
AP Election2024: ఆందోళనలను ప్రేరేపించేలా సజ్జల వ్యాఖ్యలు: దేవినేని ఉమ
AP Election Result: కాన్ఫిడెన్స్ తగ్గిందా.. ఫలితాలకు ముందు వైసీపీ నేతల్లో టెన్షన్..!
AP politics: పేట్రేగిపోతున్న వైసీపీ మూకలు.. బెంబేలెత్తుతున్న ఎన్నికల అధికారులు..!
Chandrababu: చంద్రబాబు ఎఫెక్ట్.. యూపీఎస్సీ నిర్ణయంతో కంగుతిన్న వైసీపీ!
Updated Date - May 30 , 2024 | 04:12 PM