ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు.. జగన్‌ చిట్టా బయటపెట్టిన చంద్రబాబు

ABN, Publish Date - Nov 22 , 2024 | 02:07 PM

ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బతీశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని చంద్రబాబు విమర్శలు చేశారు.

అమరావతి: అదానీ కుంభకోణంపై ఏపీ శాసనసభలో హిట్ డిస్కషన్ జరిగింది. అసత్యాలను జగన్ పదేపదే చెప్పి ప్రజలను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బతీశారని ఏకిపారేశారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని విమర్శలు చేశారు. గతంలో వ్యవస్థలు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ఆరోపించారు. షార్ట్‌, మీడియం, లాంగ్‌ టర్మ్‌ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ను గోదావరిలో కలిపారని చెప్పారు. భద్రత లేక ఏపీకి పెట్టుబడులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను పక్కనబెట్టి వాళ్లు నమ్మిన అవాస్తవాలను ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు.బరితెగించి తప్పులు చేసి.. ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించారని అన్నారు.


జగన్‌పై చర్యలు తీసుకోవాలి: విష్ణుకుమార్ రాజు

బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో ఏ కుంభకోణం జరిగినా మాజీ సీఎం జగన్ పేరు వస్తుందని చెప్పారు. అమెరికాలో జగన్‌పై చార్జిషీట్ వేశారని..అందులో జగన్ పేరు ఉందన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులో కూడా అడానికి వాటా ఇచ్చారని చెప్పారు. మాజీ సీఎం జగన్‌కు రూ.1750 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేసి జగన్ గురించి తనను అడుగుతున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని జసీఎం చంద్రబాబును కోరారు.


ఇది ప్రజా సొమ్ము కావడంతో దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏమి చేయకపోయినా ఆయనను దీనిపై 53 రోజులు జైలో పెట్టారని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై అందరం బాధపడ్డామన్నారు. జాతీయ, ప్రాంతీయ మీడియా దీనిపై ఘోషిస్తుందని చెప్పారు.జగన్ ఎవడబ్బ సొమ్ముని రుషికొండపై ప్యాలెస్ నిర్మించారని ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.దీనిపై నిజానిజాలు తేల్చాల్సి అవసరం ఉందన్నారు. రాష్ట్ర పేరు ప్రతిష్టలు దెబ్బ తింటున్న మనం చేతులు ముడుచుకొంటే ఎలా అని ప్రశ్నించారు.దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


దేశం అంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా జగన్మోహన రెడ్డి పేరు తెలిసిపోయిందని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. ఇప్పటి వరకూ స్కామ్ జరిగితే రాష్ట్రానికే పరిమితం అనుకుంటే ఇప్పడు ఆయన స్కామ్‌ల విషయంలో ఆయన స్కామ్ లీడర్ అయ్యారని విమర్శించారు. ఎక్కడ గంజాయి దొరికినా ఆ రూట్స్ అన్ని ఏపీలోవే అని చెప్పారు. ఏదో పెద్ద స్కామ్ కింద అభియోగాలు ఉండి అమెరికాలో ఓ ఆర్గనైజేషన్ ఎక్స్‌పోజ్ చేసిందన్నారు. అసలు జగన్ పేరు దానిలో ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. రుషికొండలో రూ.450 కోట్లు అన్నారని.. దీనిలో రూ. 150 కోట్లు స్కామ్ ఉందని ఆరోపించారు. గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వానికి 10.4 శాతం షేర్ ఉందని తెలిపారు.


దాన్ని కూడా కేవలం రూ.651 కోట్లకు ఇచ్చేస్తే తన మనస్సు ఎంతో బాధపడిందన్నారు. అయితే ఆ షేర్ వ్యాల్యూ రూ.2000 కోట్లు ఉంటుందని ఐఏఎస్ శర్మ లేఖలు రాశారని గుర్తుచేశారు. ఆ కంపెనీ పేరు పెద్దపేరు చెబితే సమస్యలు వస్తాయన్నారు. ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడును 53రోజులు అరెస్టు చేస్తే మనస్సు క్షోబించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వద్దకు రాకుండా మౌనంగా బాధపడిన వ్యక్తుల్లో తాము ఉన్నామని తెలిపారు. జగన్‌పై ఇంకా ఎన్నో విషయాల్లో చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కోరుతున్నానని అన్నారు. సపరేట్‌గా జగన్ అవినీతిని వెలికితీయడానికి మంత్రిపదవి ఇవ్వాలని చెప్పారు.అందరూ అడుగుతున్నారు జగన్ నీ ఫ్రెండ్ కదా అని... ఆయన నాకు ఫ్రెండ్ ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆయనే బిల్లులు ఇవ్వకుండా తనను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బును జగన్ దోచేశారని మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం ఈవ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు సంస్ధతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. అమెరికాలో ఇంత జరిగితే కనీసం మాట కూడా మాట్లడకపోతే తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని అన్నారు.


అంతర్జాతీయంగా జగన్ ఖ్యాతి: వసంత కృష్ణప్రసాద్

అదానీ కుంభకోణంపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటే అందరం దగ్గరకు వెళ్లారని విమర్శించారు. జగన్ ఖ్యాతి అంతర్జాతీయంగా వెళ్లినందుకు వైసీపీ నేతలకు ముందుగా అభినందనలు తెలిపాలని ఎద్దేవా చేశారు.

Updated Date - Nov 22 , 2024 | 03:11 PM