Gone Prakash Rao: చంద్రబాబు, లోకేష్ మంచి చేస్తున్నారు.. గోనె ప్రకాష్‌రావు ప్రశంసలు
ABN, Publish Date - Aug 06 , 2024 | 05:20 PM
మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలపై ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు సంచలన విమర్శలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందని చెప్పారు. వారి పాలన పోయి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని గోనె ప్రకాష్‌రావు పేర్కొన్నారు.
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజలకు మంచి చేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు (Gone Prakash Rao) ప్రశంసించారు. సీఎం చంద్రబాబును మంగళవారం నాడు గోనె ప్రకాశరావు కలిశారు. అనంతరం మీడియాతో గోనె ప్రకాశరావు మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందని ఆక్షేపించారు. బంధువులే తనకు తెలీదంటూ సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్పిన దుర్మార్గుడు జగన్ అని గోనె ప్రకాష్‌రావు విమర్శించారు.
జగన్‌లా పరదాలు కట్టుకోలేదు..?
జన్మభూమి లాంటి కార్యక్రమాలు చంద్రబాబు చేపడితే విదేశీ విరాళాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఏపీలో 36 మందిని హత్య చేసినట్లుగా చెబుతున్న జగన్ వాటి వివరాలు బహిర్గతం చేయాలని గోనె ప్రకాష్‌రావు డిమాండ్ చేశారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి జగన్‌లా పరదాలు కట్టుకుని పర్యటించలేదని ఆక్షేపించారు. రాష్ట్రపతి పాలన అంటూ డిమాండ్ చేసిన జగన్‌కు సిగ్గుందా..? అని విమర్శించారు. ప్రజల నుంచి పూర్తి మెజార్టీ వచ్చాక రాష్ట్రపతి పాలన ఎలా అనుమతిస్తారని గోనె ప్రకాష్‌రావు ప్రశ్నించారు.
Updated Date - Aug 06 , 2024 | 05:36 PM