Free Bus: బస్సు ఎక్కితే నో టికెట్... ఎప్పటినుంచంటే...
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:56 PM
సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని రానున్న సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది.
అమరావతి: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ (శనివారం) ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మంత్రి వర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం నియమకం అయింది . హోం మంత్రి అనిత, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉప సంఘం ఏర్పాటైంది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వినర్‌గా ఈ ఉప సంఘం ఉండనుంది.
ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈరోజు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. తాజాగా ఈ పథకం అమలుపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి నుంచే ఫ్రీ జర్నీ అమలు చేస్తామని, దీనికోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందని చెప్పిన విషయం తెలిసిందే.
సమూల మార్పులు తీసుకువస్తాం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పార్వతీపురం మన్యం జిల్లా: ఆర్టీసీ డిపోల సమూల మార్పులు తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆరు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను ఇవాళ(శనివారం) మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ప్రారంభించారు. ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు నగదు పారితోషకాలను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆర్టీసీ డిపో నూతన భవనాలు శ్రీకారం చుట్టామని అన్నారు. జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ మైదానం ఏర్పాటు చేస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu : ధాన్యం సేకరణలో తప్పులు జరగొద్దు
YS Sharmila : వారే కొట్టుకుని.. రాహుల్‌ను అంటున్నారు
AP High Court : మధ్యవర్తిత్వంపై హైకోర్టులో ముగిసిన శిక్షణ
Read Latest AP News and Telugu News