Parthasarathy: జగన్ ప్రభుత్వంలో రంగులు వేయడమే తప్ప అభివృద్ధి జాడ లేదు
ABN, Publish Date - Jul 14 , 2024 | 09:51 PM
ఆక్వా పర్యాటక రంగాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. కైకలూరుకు స్వర్గధామమైన ఆక్వారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఏలూరు జిల్లా( కైకలూరు): సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Minister Kolusu Parthasarathy) తెలిపారు. కైకలూరులో టీడీపీ నాయకులు నిర్వహించిన అభినందన సభకు రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర కొలుసు పార్థసారథి ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ యాదవ్ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే, ఎంపీలను కూటమి నాయకులు గజమాలతో సత్కరించారు. .ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ప్రజలు అప్పగించిన బృహత్తర బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
సీఎం చంద్రబాబుముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే ఐదు సంతకాలతో ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకొన్నారని తెలిపారు. గత పాలకుల వైఫల్యాలు వల్ల రాష్ట్ర పరిస్థితి దారుణంగా మారిందని మండిపడ్డారు. చంద్రబాబు కాకుండా ఏ ముఖ్యమంత్రి ఈ పీఠంపై కూర్చున్న పారిపోయే పరిస్థితులు వైసీపీ పాలకులు నెలకొల్పారని చెప్పారు. విజనరీ నాయకుడుగా దూరదృష్టి కలిగిన చంద్రబాబు సీఎం కావడంతో పారిశ్రామికవేత్తలు అమరావతికి క్యూ కడుతున్నారని వివరించారు. పాఠశాలకు రంగులు వేస్తే అభివృద్ధి అనుకున్న గత పాలకులు, ఉపాధ్యాయులు నియమకాలను మర్చిపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ని ప్రకటించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టిందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు..
ఆక్వా పర్యాటక రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారు: మంత్రి కొల్లు రవీంద్ర
ఆక్వా పర్యాటక రంగాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. కైకలూరుకు స్వర్గధామమైన ఆక్వారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రెండు, మూడు నెలల్లోనే ఆక్వారంగానికి రూ.1.50 పైసలకే విద్యుత్తును అందజేస్తామని మాటిచ్చారు. పార్టీలు ,కులాలు, మతాలు చూడకుండా ప్రతి రైతుకు రాయితీ విద్యుత్ అందజేస్తామని తెలిపారు. కైకలూరులో బీసీ భవన్ నిర్మాణం త్వరలోనే చేపడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆటపాక పక్షుల కేంద్రంతో సహా కొల్లేరు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కొల్లేరు కాంటూరూ కుదింపు కచ్చితంగా చేసి తీరుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Updated Date - Jul 14 , 2024 | 09:52 PM