Share News

Palla Srinivasa Rao: మంత్రుల మార్పుపై.. పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Dec 31 , 2024 | 03:04 PM

Palla Srinivasa Rao: అసమర్థత, అవినీతి, ఆరోపణల మీద తప్ప మంత్రుల మార్పు ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉండదని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థలో నాలుగేళ్ల వరకు పదవి కాలం ఉంటుంది కనుక ..ఆ సమయం పూర్తి అయిన తర్వాత ఆలోచన చేస్తామని అన్నారు.

Palla Srinivasa Rao: మంత్రుల మార్పుపై.. పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
Palla Srinivasa Rao

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ చట్టం ప్రవేశ పెట్టామని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.వైసీపీ దుర్మార్గులపై పోరాటం చేశామని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిందని అన్నారు.సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతి.. బీసీకి చెందిన విజయానంద్‌ను ఏపీ సీఎస్‌గా నియమించారని చెప్పారు. రాష్ట్ర డీఐజీ కూడా బీసీయే..ఎన్నో పదవులు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని..ఉన్నత పదవులను బీసీలకు కేటాయిస్తుందని అన్నారు. ఇవాళ(మంగళవారం) విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... బీసీలను జగన్ హయాంలో అణగదొక్కారు..అంతా రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.


వైసీపీ హయాంలో బీసీ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేశారని విమర్శించారు. వైసీపీ హయాంలో అమర్నాథ్ గౌడ్‌ను చంపారని బీసీ నాయకులను హింసించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మంత్రి పదవి కంటే తనకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి చాలా గొప్పదని చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విషయంలో తప్పుడు ప్రచారాలను స్వయంగా ఖండించారన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు టీడీపీ కంట్రోల్లో ఉండదని.. వాటి మీద తాను ఎలా స్పందిస్తానని ప్రశ్నించారు. అసమర్థత, అవినీతి, ఆరోపణలు మీద తప్ప మంత్రుల మార్పు కూటమి ప్రభుత్వంలో ఆ ఆలోచన ఉండదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలో నాలుగేళ్ల వరకు పదవి కాలం ఉంటుంది కనుక ..ఆ సమయం పూర్తి అయిన తర్వాత ఆలోచన చేస్తామని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ త్వరలో నిలబెట్టుకుంటామని మాటిచ్చారు. ఇప్పటికే ఇదే అంశంపై ఒక కమిటీ చేశామని.. నివేదిక ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. వైసీపీ నేతలు చాలా మంది కూటమి పార్టీల్లో చెరడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. కూటమి పార్టీలు మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటాయని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట

AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ

AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 03:07 PM