ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Big Breaking: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి..

ABN, Publish Date - May 23 , 2024 | 04:48 PM

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీవీప్యాట్ మెషీన్ ధ్వంసం కేసులో ఇరుక్కున్న మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది.

Pinnelli Ramakrishna Reddy

గుంటూరు, మే 23: ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీవీప్యాట్ మెషీన్ ధ్వంసం కేసులో ఇరుక్కున్న మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది.


కోర్టులో లొంగిపోతారా?

ఇదిలాఉంటే.. నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. నరసరావుపేటలో అప్రమత్తమయ్యారు. కోర్టు ఆవరణలో భారీగా పహారా కాస్తున్నారు పోలీసులు. అయితే, పిన్నెల్లి కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని కేవలం అనుమానం మాత్రమే ఉందని.. ఎలాంటి ఖచ్చితమైన సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు.


సీఈసీకి డీజీపీ నివేదిక..

పాల్వయి గేట్ గ్రామంలో పోలింగ్ బూత్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీవీప్యాట్‌ యంత్రాన్ని ధ్వంస చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం.. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. దాంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆయన పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఈసీకి కూడా నివేదించారు రాష్ట్ర డీజీపీ. సీఈఓ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపారు డీజీపీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆయన్ను అరెస్టు కచేసేందుకు పాలన విభాగం ఎడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు నియమించామన్నారు. లుకౌట్ నోటీసులు ఇచ్చామని నివేదికలో పేర్కొన్నారు డీజీపీ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని త్వరలో అరెస్టు చేస్తామని డిజీపీ తెలిపారు. సిట్ ఐజీ వినీత్ బ్రిజీలాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నట్టు డీజీపీ తెలిపారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A-1 గా చేర్చామని చెప్పారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 04:48 PM

Advertising
Advertising