ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sharmila: పోలవరంపై షర్మిల షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jun 29 , 2024 | 05:35 PM

పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపీ ,వైసీపీ పార్టీలే కారణమని అన్నారు.

YS Sharmila

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపీ ,వైసీపీ పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ కట్టి 28లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయమని గుర్తుచేశారు. ట్విట్టర్ వేదికగా ఎన్డీఏ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

పంతాలు పట్టింపులకు పోయి జీవనాడిపై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్పా మరోకటి కాదని విమర్శించారు. విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే... మోదీ సర్కార్ ఆ బాధ్యత పదేళ్లు విస్మరించి నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపించిందని మండిపడ్డారు.


అంచనా వ్యయం పెంచిన జగన్

‘‘కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్‌ను తానే కడతానని చెప్పి పోలవరం, సోమవారం అంటూ హడావిడి తప్పా.. చంద్రబాబు మొదటి ఐదేళ్లలో చేసింది శూన్యం. రివర్స్ టెండరింగ్ పేరుతో మాజీ సీఎం జగన్ అంచనా వ్యయం పెంచాడే తప్పా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. రూ.10 వేల కోట్లతో కాంగ్రెస్ హయాంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసి... అక్షరాల 76 వేల కోట్లు పెంచారు. ప్రాజెక్ట్ కట్టాలంటే మరో ఐదేళ్లు పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. కేంద్రాన్ని శాసించే అధికారం మీ దగ్గరుంది కాబట్టి త్వరగా పూర్తి చేయాలి. పూర్తి స్థాయి నిధులు తెచ్చి,రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా చూడాలి. పోలవరం త్వరగా పూర్తి చేయాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.

Updated Date - Jun 29 , 2024 | 05:57 PM

Advertising
Advertising