ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలపై సీఎం చంద్రబాబు సీరియస్

ABN, Publish Date - Sep 20 , 2024 | 03:17 PM

తిరుపతి లడ్డూ తయారీలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu

అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఈరోజు(శుక్రవారం) ఏపీ సచివాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర వివరాలతో లడ్డూ ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.


ALSO Read: YS Sharmila: తిరుమల కల్తీ లడ్డూపై షర్మిల వ్యాఖ్యల్లో అర్ధమేంటి.. వైసీపీని సమర్థిస్తున్నట్టా లేక..

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అపవిత్ర, జంతు సంబంధ పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. భక్తుల ఆవేదనను తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.


ALSO Read: Nageshwar rao: 177 ఏళ్ల నాటి సిపాయిల తిరుగుబాటును గుర్తు చేసిన జగన్ అంటూ..

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారధి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. లడ్డూ తయారీలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Gold Price Hike: బంగారం ప్రియులకు భారీ షాక్.. ఆల్ టైం హైకి ధరలు

Nara Lokesh: డయాలసిస్‌ సెంటర్‌‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

Narayana: ఇది లక్షల భక్తుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి

Read Latest AP News ANd Telugu News

Updated Date - Sep 20 , 2024 | 03:46 PM