AP NEWS: చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలి: వడ్డే శోభానాద్రీశ్వరరావు
ABN , Publish Date - Apr 15 , 2025 | 02:31 PM
Vadde Sobhanadriswara Rao: ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు అన్నారు. ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని చెప్పారు. చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే కొనసాగుతున్నారని, కార్పొరేట్‌లకు పెద్దపీట వేస్తున్నారని వడ్డే శోభానాద్రీశ్వరరావు ఆరోపించారు.

విజయవాడ: రాజధాని అమరావతి కోసం ఇప్పటికే 33 వేల ఎకరాలు తీసుకున్నారని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు అన్నారు. ప్రభుత్వ భూములు కలిపి 58 వేల ఎకరాలు ఉన్నాయని చెప్పారు. హై కోర్టు పరిపాలన భవనాలు, అసెంబ్లీ ,మండలి భవనాలు ఇప్పటికే నిర్మాణాలు జరిగాయని గుర్తుచేశారు. కొత్తగా అదనంగా 44 వేల ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు. ఇప్పటికీ తీసుకున్నా భూములు చాలవా.. ఇంకా కావాలనే ధోరణిలో ప్రభుత్వం ఉందని అన్నారు. వివిధ బ్యాంకుల రూ. 33 వేల కోట్ల రూపాయలు అమరావతికి రుణాలు మంజూరు చేశాయని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు చెప్పారు.
ఇంకా రూ. 69 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు అన్నారు. రెండు కళ్ల సిద్దాంతం పేరుతో గతంలో ఆంధ్రప్రదేశ్ విభజనకు దోహదం చేశారని చెప్పారు. విభజన జరిగాక అనుభవజ్ఞుడని చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ తీరుతో నష్టం కలిగినా...విభజన చట్టంలో ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్ పూడ్చటం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు వంటి అంశాలు పొందుపరిచారని అన్నారు. మన దురదృష్టం మోదీ ప్రభుత్వం విభజన హామీలను గతంలో విస్మరించిందని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయలేదని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు అన్నారు. చంద్రబాబు తప్పిదాలతో గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పానని అలాగే వచ్చారని గుర్తుచేశారు. జగన్ పాలన అంతా అరాచకంగా, టీడీపీ కార్యకర్తలపై దాడులు, కేసులు వేధింపులతో సాగిందని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే కొనసాగుతున్నారని, కార్పొరేట్‌లకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. దీంతో మళ్లీ ప్రమాదం వచ్చే అవకాశముందని అన్నారు. ఇప్పటికే 58 వేల ఎకరాలు రాజధాని అమరావతికి భూమి ఉందని, మళ్లీ 44 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికా అని నిలదీశారు. పేద ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు , మెట్రో రైలు కాదన్నారు. చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలని.. ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని వడ్డే శోభానాద్రీశ్వరరావు హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
CM Chandrababu Naidu: మళ్లీ అంబేడ్కర్ విదేశీ విద్య
Vontimitta Accident: అతి వేగం ఖరీదు మూడు ప్రాణాలు
Intermediate Results: ఇంటర్‌లో ‘ప్రభుత్వ’ టాపర్లకు నేడు సన్మానం
Read Latest AP News And Telugu News