మట్టి గణపతులనే పూజించాలి
ABN , Publish Date - Sep 06 , 2024 | 11:18 PM
మట్టి వినాయకుల ప్రతిమ లనే పూజించి పర్యావ రణాన్ని పరిరక్షిద్దామని ఎమ్మెల్యే షాజహానబా షా పిలుపునిచ్చారు.
మదనపల్లె అర్బన, సెప్టెంబరు6: మట్టి వినాయకుల ప్రతిమ లనే పూజించి పర్యావ రణాన్ని పరిరక్షిద్దామని ఎమ్మెల్యే షాజహానబా షా పిలుపునిచ్చారు. శు క్రవారం మదనపల్లె పట్ట ణంలో పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎన్టీఆర్ సర్కిల్‌లో గ్రీన హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 300 లకు పైగా వినాయక ప్రతిమలు, మొక్కలు పంపిణీ చేశారు. స్థానిక నీరుగట్టువారి పల్లె మార్కెట్ యార్డు వద్ద తెలుగు యువత నాయకులు కట్టాదొర స్వామినాయుడు ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. తాజ్ హోటల్ యాజమాని, సేదా సేవా సంస్థ వ్యవస్థాపకుడు పఠాన ఖాదర్ ఖాన ఆధ ట్వ ర్యంలో 650 మట్టి వినాయక ప్రతిమలు, మొక్కలను ఎమ్మెల్యే చేతులమీదుగా పేదలకు పంపిణీ చేశారు. మెట్రో కాంప్లెక్స్ వద్ద హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అబూబక్కర్ సిద్ధిక్ మట్టి విగ్రహా లు, మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.
కురబలకోటలో: వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ కమాల్ బాషా పిలుపుని చ్చారు. మిట్స్ రెస్పాన్సిబుల్ క్లబ్‌ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టిబొమ్మల తయారీపై పోటీలు నిర్వహించారు.
నిమ్మనపల్లిలో: మండలంలోని పలు గ్రామాలకు మదనపల్లి జనసేన సీనియర్ నాయకుడు తోటకళ్యాన ఆధ్వర్యంలో వినా యక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేఽశా రు. మండలంలోని దిగువపల్లి, పారేసువారిపల్లి, యగువపల్లి, యర్రప్పగారిపల్లి, కుమ్మరపల్లి, పూలవాండ్లపల్లి, కొత్తపల్లి, అగ్రహా రం, బండమీదపల్లి, నాయునివా రిపల్లి, వడ్డిపల్లి గ్రామస్థులకు వినాయక విగ్రహలను పంపిణీ చేశారు.
పీలేరులో: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీలేరులోని సాయి బాబా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం సభ్యులు శుక్రవా రం భక్తులకు మట్టి వినాయక ప్రతిమలు వితర ణగా అంద జేశారు. కార్యక్రమంలో వారు రెండు వేల మట్టి ప్రతిమలను భక్తులకు పంచి పెట్టారు.
వాల్మీకిపురంలో: వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వాల్మీకిపురం స్టేట్‌బ్యాంక్ మేనేజర్ చైతన్య శుక్రవారం బ్రాంచ కార్యాలయంలో 70మందికి పైగా ఖాతా దారులకు మట్టి వినాయక విగ్రహాల కిట్టు బ్యాగులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మదనపల్లె చీఫ్ మేనేజర్ నరసింహు లు, ఏపీ ఎం నరసింహులు, వెలుగు సీసీలు పాల్గొన్నారు.
కలికిరిలో భారీ వినాయక విగ్రహాల వితరణ
కలికిరి, సెప్టెంబర్టు 6:కలికిరి పంచాయతీకి చెందిన యువ చార్టెడ్ అకౌంటెంట్ గ్రామస్థులకు దాదాపు రూ.35 వేల ఖరీదు చేసే 15 భారీ విగ్రహాలను ఉచితంగా అందజేశారు. కలికిరి పంచాయతీ అండేకురవపల్లెకు చెందిన సిబ్బాల దినకర్ బెంగుళూరులో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. మాజీ జడ్పీటీసీ నల్లారి చంద్రకుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ రహంతుల్లా, కలికిరి పంచాయతీ మాజీ సర్పంచు నల్లారి లక్ష్మీకర్ రెడ్డి ఆయా గ్రామాలకు చెందిన యువకులకు ఈ విగ్రహాలు అందజేశారు.