Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

ABN , Publish Date - Jan 27 , 2024 | 11:22 PM

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాయకులు శనివారం తిరిగి సొంతగూటికి చేరారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
టీడీపీ కండువాలు వేస్తున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌, సురేశ్‌నాయుడు

దువ్వూరు (మైదుకూరు), జనవరి 27 : గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాయకులు శనివారం తిరిగి సొంతగూటికి చేరారు. దువ్వూరు మండలం రామాపురానికి చెందిన గుర్రం రఘునాథనాయుడు వారి అనుచర వర్గ కుటుంబాలతో సహా శనివారం సాయంత్రం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, సీఎం సురేష్‌ నాయుడు సమక్షంలో దాదాపు 50 కుటుంబాల వారు టీడీపీ చేరారు. ఈ సందర్భంగా పుట్టా, సురేష్‌ నాయుడులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్‌ చంద్రబాబునాయుడు చేతుల్లోనే ఉందని ఈ కార్యక్రమంలో కొల్లు రఘునాథనాయుడు, గుది సురేష్‌, కొల్లు సుధాకర్‌ , నాయకుల బోరెడ్డి వెంకట రమణారెడ్డి, పుట్టా ప్రభాకర్‌యాదవ్‌, బాబు, జనసేన నాయకులు మల్హోత్ర పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2024 | 11:23 PM