Share News

కమనీయంగా వేంకటేశ్వర కల్యాణం

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:23 PM

మండలంలోని ముడుంపాడు గ్రామ పంచాయతీ పరికిబండ బిడికీ సమీపంలో వెలసిన ఆలయంలో ఆదివారం వేంకటేశ్వర కల్యాణం నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, అర్చన, కలశపూజ, మహామంగళ హారతి నిర్వహించారు.

కమనీయంగా వేంకటేశ్వర కల్యాణం
కల్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి.

సుండుపల్లె, ఫిబ్రవరి 25: మండలంలోని ముడుంపాడు గ్రామ పంచాయతీ పరికిబండ బిడికీ సమీపంలో వెలసిన ఆలయంలో ఆదివారం వేంకటేశ్వర కల్యాణం నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, అర్చన, కలశపూజ, మహామంగళ హారతి నిర్వహించారు. ఉదయం 9 గంటలకు తిరుపతి స్వాముల వారికి అభిషేకం చేశారు. అనంతరం వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి భూదేవిలను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణ వేదికపై ఆసీనులను చేశారు. వేదమంత్రాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ కల్యాణోత్సవం నిర్వహించారు. జీ. రెడ్డివారిపల్లెకు చెందిన రాయపాటి జయరామయ్య కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. సాయంత్రం 4 గంటలకు నాకిది గోపాలకృష్ణపురం వరకు రథోత్సవం నిర్వహించారు.

Updated Date - Feb 25 , 2024 | 11:23 PM