జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..
ABN, Publish Date - Apr 13 , 2024 | 01:32 PM
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి ..
కడప, ఏప్రిల్ 13: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి షర్మిలను కలిశారు. ప్రచారంలో ఉన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల.. చిట్టిబాబుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడగా.. ఇప్పుడు మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఇంకెంత మంది జంప్ అవుతారో చూడాలి.
పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా విప్పర్తి వేణుగోపాల్ పేరును ప్రకటించింది వైసీపీ అధిష్టానం. దాంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండేటి చిట్టిబాబు.. పార్టీని వీడాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ఇంతకాలం వేచిచూసే దోరణిలో ఉన్న చిట్టిబాబు.. చివరకు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 175 స్థానాలకు గానూ 126 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాల అభ్యర్థులను సైతం త్వరలోనే ప్రకటించనుంది. ఇక పి.గన్నవరం సీటును కూడా ఎవరికీ ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా.. తనకు అవకాశం లభిస్తుందని భావించారు. మరి పి.గన్నవరం కాంగ్రెస్ అభ్యర్థిగా చిట్టిబాబును ప్రకటిస్తారా? లేదా? అనేది చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 13 , 2024 | 01:32 PM