Andhra Padesh: గుడ్ న్యూస్.. ఏపీలో భారీ పెట్టుబడికి సిద్ధమైన బీపీసీఎల్..!
ABN , Publish Date - Jun 14 , 2024 | 02:09 PM
చంద్రబాబు(CM Chandrababu) ఇలా ముఖ్యమంత్రి అవడమే ఆలస్యం అన్నట్లుగా.. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి పలు సంస్థలు. అవును, ఏపీకి త్వరలో శుభవార్త అందనుంది. రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
అమరావతి, జూన్ 14: చంద్రబాబు(CM Chandrababu) ఇలా ముఖ్యమంత్రి అవడమే ఆలస్యం అన్నట్లుగా.. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి పలు సంస్థలు. అవును, ఏపీకి త్వరలో శుభవార్త అందనుంది. రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. రూ. 50 వేల కోట్ల భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటును చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అయితే, బీపీసీఎల్ రిఫైనరీని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కోరుతున్నాయని తెలుస్తోంది. రూ. 500 కోట్ల రుణం, 15 ఏళ్లపాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వడానికి మధ్యప్రదేశ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అదే స్థాయిలో ఏపీ నుంచి ప్రోత్సాహకాలను ఆశిస్తోంది బీపీసీఎల్. దీంతో బీపీసీఎల్, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఏపీ అధికారులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం అధికారులు సైతం.. త్వరలో ఏపీకి శుభవార్త అందుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు గనుక ఏపీకి వస్తే.. స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.