Share News

CM Chandrababu: ప్రజల కోసమే నా జీవితం అంకితం

ABN , Publish Date - Sep 09 , 2024 | 06:20 PM

‘ప్రజల కోసమే నా జీవితం మొత్తం పని చేస్తా’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో వరదలపై యుద్ధం చివరి దశకు వచ్చిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ యుద్ధం రేపటితో ముగిస్తే.. ఇక ఏపీ పునర్నిర్మాణంపై దృష్టి పెడతామని అన్నారు.

CM Chandrababu: ప్రజల కోసమే నా జీవితం అంకితం
CM Nara Chandrababu Naidu

అమరావతి: ‘ప్రజల కోసమే నా జీవితం మొత్తం పని చేస్తా’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. విజయవాడలో వరదలపై యుద్ధం చివరి దశకు వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ యుద్ధం రేపటితో ముగిస్తే.. ఇక ఏపీ పునర్నిర్మాణంపై దృష్టి పెడతామని అన్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు(సోమవారం) ముఖ్యమంత్రి పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారి బాధలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... సింగ్‌నగర్‌లో వరద వచ్చిన తొలి రోజు తాను పర్యటించినప్పటికీ, ఇప్పటి పరిస్థితుల్లో చాలా పురోగతి ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ALSO READ: Minister Ram Mohan: పౌర విమానయాన రంగం అభివృద్ధిపై మంత్రి రామ్మోహన్ కీలక నిర్ణయాలు

ప్రజలంతా నా వెంట నిలిచారు

‘‘గత ఏడాది ఇదే రోజు ఏ ఆధారం లేకుండా అక్రమ కేసులో నన్ను వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ రోజు ప్రజలంతా నా వెంట నిలిచారు. నా పట్ల అంత ఆదరణ చూపిన ప్రజల కోసం నా జీవితం అంకితం చేసి పనిచేస్తా. నన్ను ఏ పేరుతో పిలిచినా పలుకుతూ, వారి మధ్యే ఉండి పని చేస్తా. ఈరోజు ప్రజలకు కష్టం వస్తే నేనూ వారి మధ్యలోనే ఉన్నాను. ఆ రోజూ బస్సులోనే ఉన్నాను, ఈ రోజూ బస్సులోనే ఉన్నాను. ప్రజల ముఖాల్లో నవ్వు చూద్దామనుకుంటుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో ఇంట్లో ఒక్కో విషాద ఘటన ఉంది. అర్బన్ కంపెనీ సాయంతో పాడైన అన్ని వస్తువులు బాగు చేయిస్తున్నాం. ఈ యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచుతాం. ప్రజలు నిలదొక్కుకునేందుకు మా ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తోంది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ALSO READ:Heavy Rains: భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

ప్రకాశం బ్యారేజీపై కుట్ర పన్నారు...

మొదటి రోజు ప్రజలు చాలా బాధగా ఉండటం చూశానని అన్నారు. 9వ రోజు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న పూర్తి నమ్మకం చూశానని తెలిపారు. బుడమేరుపై జగన్ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల 2.75లక్షల మంది తీవ్ర బాధలు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సందర్భాల్లో చివరి వ్యక్తికి సహాయం చేయలేకపోయామనే బాధ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బోట్ల ద్వారా ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టించే కుట్ర వైసీపీ నేతలు పన్నారని విమర్శలు చేశారు. మొన్నటి వరకూ ఇసుక దొంగ వ్యాపారం చేసిన బోట్లను, ప్రజలను ముంచేందుకు పంపించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.


ALSO READ: Sam Pitroda: రాహుల్ పప్పు కాదు.. ఆయనలో క్వాలిటీస్ చెప్పిన శామ్ పిట్రోడా

జఠిలమైన సమస్యను సమన్వయంతో ప్రణాళికతో జాగ్రత్తగా పరిష్కరిస్తున్నామని అన్నారు. ఆప్కో, ఇతరత్రా సంస్థల దగ్గర ఎన్ని దుస్తులు ఉంటే అన్నీ తెప్పించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో ఉండే వారికి తలా ఒక జత దుస్తులు అందజేస్తామని మాటిచ్చారు. అప్కో లేదా ఇతర సంస్థల నుంచి వెంటనే దుస్తులు తెప్పించి అందజేయాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Rains: అంతిమయాత్రకు తప్పని వరద కష్టాలు

Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 09 , 2024 | 07:10 PM