Share News

AP News: సీబీసీఐడీకి డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:55 AM

Andhrapradesh: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డాక్టర్ శ్రీహరి రావు హత్య కేసును సీబీసీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో 2021 నవంబర్ 27న డాక్టర్ శ్రీహరి రావును దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ శ్రీహరి రావు నాటి వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వ్యాపార భాగస్వామి కావడంతో హత్య సంచలనంగా మారింది.

AP News: సీబీసీఐడీకి డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు
CBCID

కృష్ణా జిల్లా, జూలై 26: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డాక్టర్ శ్రీహరి రావు హత్య కేసును సీబీసీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో (Avanigadda) 2020 నవంబర్ 27న డాక్టర్ శ్రీహరి రావును దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ శ్రీహరి రావు నాటి వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వ్యాపార భాగస్వామి కావడంతో హత్య సంచలనంగా మారింది. కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేక పోవడంతో హత్య కేసు దర్యాప్తు విషయంలో రాజకీయ ప్రమేయం ఉందని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. దర్యాప్తును ప్రభుత్వమే కావాలని పక్కదారి పట్టించిందని నియోజకవర్గంలో పుకార్లు షికార్లు చేశాయి. హత్య కేసు గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుల దృష్టికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తీసుకువెళ్లారు. ఈ క్రమంలో హత్య కేసును సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాలపై సెల్ఫీ వీడియో ద్వారా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.

KCR: సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ


అసలేం జరిగిందంటే...

కాగా... అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడిగా పేరొందిన డాక్టర్‌ కోట శ్రీహరిరావు (65) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. డాక్టర్‌ శ్రీహరిరావు భార్య, కుమార్తె ఊరుకు వెళ్లగా.. డాక్టర్‌ ఒక్కరే ఇంట్లో ఉన్న సమయంలో తెల్లవారుజామున ఆయన హత్యకు గురయ్యాడు. బయటకు వెళ్లాల్సిన డాక్టర్ ఎంతకీ ఇంట్లో నుంచి రాకపోవటంతో ఆస్పత్రిలో ఉన్న నర్సు ఫోన్‌ చేశారు. స్పందన రాకపోవడంతో పై అంతస్తులోకి వెళ్లి చూడగా.. పడకగదిలో రక్తపు మడుగులతో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించింది. సమాచారం తెలుసుకున్న నాటి స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని డాక్టర్‌ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


హంతకుడు ఎలాంటి ఆధారాలూ లభ్యం కాకుండా ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను వెనక్కు తిప్పి వేయటంతో పాటు ఫుటేజ్‌ని భద్రపరిచే డీవీఆర్‌ను కూడా ఎత్తుకుపోయాడు. దీనికితోడు వేలిముద్రలు సేకరించే క్రమంలోనూ ఆసుపత్రి ఆవరణలోనూ, చుట్టుపక్కల ఎక్కువ మంది వేలిముద్రలు లభ్యం కావటంతో ఆ వేలిముద్రలు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లవా లేక హంతక ముఠా వారికి చెందినవా అన్న విషయం తేల్చేందుకు పోలీసులు దాదాపు 300 మంది దగ్గర నుంచి వేలిముద్రలను సేకరించారు. బయట పడిన పాత ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు డాక్టర్‌ శ్రీహరి రావు ఇంటి వద్ద మొదటి నుంచి సీసీ కెమెరాల నిఘా కొనసాగుతూనే ఉంది.

PM Modi: అమర జవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళి.. త్యాగాలను స్మరించుకున్న ప్రధాని


మార్చిలో పాత సిస్టంను తొలగించి కొత్తదాన్ని ఇన్‌స్టాల్‌ చేశారు. పాత సిస్టంలో ఫిబ్రవరి 24వ తేదీన సరిగ్గా 10 గంటల సమయంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఆసుపత్రిలో సంచరించినట్లుగా, అదే వ్యక్తి ఆరోజు కూడా కెమెరాలను పైకి తిప్పేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఆరోజు కూడా శ్రీహరిరావు ఇంటి వద్ద కుటుంబ సభ్యులెవరూ లేరు. అయితే ఆ అగంతకుడు లోపలకు వెళ్లే ప్రయత్నం కొన్ని కారణాల వల్ల విఫలం కావటంతో వెనుతిరిగాడు. ఆ అగంతకుడు దొంగతనానికి వచ్చి ఉంటాడని, ఎలాంటి వస్తువులూ పోకపోవటంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారని తెలిసింది. హత్య జరిగిన రోజు కూడా ఫిబ్రవరిలో మాదిరి వైద్యుడు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆ అగంతకుడే ఇంటిలోకి చొరబడి శ్రీహరిరావును దారుణంగా హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు విచారణ సీబీసీఐడీకి అప్పగించిన నేపథ్యంలో ఇప్పటికైనా నిందితుడు దొరుకుతాడా? లేదా అనేది చూడాలి.


ఇవి కూడా చదవండి..

YS Jagan: ఢిల్లీలో జగన్‌కు దారుణ అవమానం..

MP Raghunandan Rao: నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా.. రండి..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 12:03 PM