Hyderabad: క్రైం బ్రాంచ్ పోలీసులమంటూ.. రూ.22 లక్షలు కొట్టేశారు..
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:48 AM
ముంబై క్రైం బ్రాంచ్(Mumbai Crime Branch) నుంచి మాట్లాడుతున్నామని హైదరాబాద్(Hyderabad) వాసికి ఫోన్ చేసిన కేటుగాళ్లు అతడి ఖాతాల నుంచి రూ.22 లక్షలు కొట్టేశారు. నగరానికి చెందిన వ్యక్తికి ఇటీవల కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
- హైదరాబాద్ వాసి ఖాతా నుంచి రూ.22 లక్షలు స్వాహా
హైదరాబాద్ సిటీ: ముంబై క్రైం బ్రాంచ్(Mumbai Crime Branch) నుంచి మాట్లాడుతున్నామని హైదరాబాద్(Hyderabad) వాసికి ఫోన్ చేసిన కేటుగాళ్లు అతడి ఖాతాల నుంచి రూ.22 లక్షలు కొట్టేశారు. నగరానికి చెందిన వ్యక్తికి ఇటీవల కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ముంబై ఫెడెక్స్ కొరియర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీరు ఇరాన్ పంపిన పార్సిల్‌లో 5 పాస్‌పోర్టులు, 15 బ్యాంకు ఖాతా పుస్తకాలు, 150 గ్రాముల ఎండీఎంఏ గుర్తించామని, ఈ విషయం గురించి ముంబై క్రైం బ్రాంచ్(Mumbai Crime Branch) అధికారులతో మాట్లాడాలని సూచించాడు. తర్వాత స్కైప్ కాల్(Skype call)లో పోలీసు దుస్తులు ధరించిన వ్యక్తి బాధితుడితో మాట్లాడాడు.
ఇదికూడా చదవండి: KCR: సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ
మీపై డ్రగ్స్ కేసుతోపాటు విదేశాలకు డబ్బు తరలించినందుకు మనీ లాండరింగ్(Money laundering) కేసులు నమోదయ్యాయని చెప్పాడు. బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకొని, అందులో ఉన్న రూ.22 లక్షలను ఆర్‌బీఐ క్లియరెన్స్ కోసం పంపాలని సూచించాడు. గంటల వ్యవధిలో ఆర్‌బీఐ క్లియరెన్స్(RBI Clearance) వచ్చి తిరిగి మీ ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయని చెప్పాడు. డబ్బులు రాకపోవడం, ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు(Cyber crime police) ఫిర్యాదు చేశాడు.
అర్ధరాత్రి ఫిర్యాదు.. బాధితురాలి డబ్బు వెనక్కి
సైబర్ నేరగాళ్లు ఈ నెల 11న అర్ధరాత్రి నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని ఖాతా నుంచి రూ.97,312 కాజేశారు. వెంటనే ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. నైట్ డ్యూటీ(Night duty)లో ఉన్న టీమ్ 9 కానిస్టేబుల్ సందీప్ సత్వరమే స్పందించి కేసు నమోదు చేశారు. డబ్బు బదిలీ అయిన ఖాతా కలిగిన మర్చంట్ లోకాన్ సొల్యూషన్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి ఖాతాను స్తంభింపజేశారు. దాంతో సంస్థ ప్రతినిధులు డబ్బు ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేసుకొని, తిరిగి చెల్లించేందుకు అంగీకరించి, గురువారం ఆమె ఖాతాకు రూ. 97,312 డిపాజిట్ చేశారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News