Share News

మహిళల భద్రతకు శక్తి యాప్‌

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:24 AM

అత్యవసర సమయంలో మహిళలు శక్తి యాప్‌ వినియోగించుకోవాలని, ఈ యాప్‌ మహిళల భద్రత కోసమే ప్రత్యేకంగా రూపొందించిందని ఏసీపీ దామోదర్‌ తెలిపారు.

మహిళల భద్రతకు శక్తి యాప్‌
శక్తి యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన విద్యార్థినులతో ఏసీపీ దామోదర్‌, సీఐ పవన్‌ కిషోర్‌ తదితరులు

మహిళల భద్రతకు శక్తి యాప్‌

ఏసీపీ దామోదర్‌

పటమట/ఆటోనగర్‌, మార్చి 18 (ఆంధ్ర జ్యోతి): అత్యవసర సమయంలో మహిళలు శక్తి యాప్‌ వినియోగించుకోవాలని, ఈ యాప్‌ మహిళల భద్రత కోసమే ప్రత్యేకంగా రూపొందించిందని ఏసీపీ దామోదర్‌ తెలిపారు. మంగళవారం పటమట పోలీసుల ఆధ్వర్యంలో స్టెల్లా కళాశాల విద్యార్థినులకు శక్తి యాప్‌పై ఏసీపీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మహిళ శక్తి యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్‌ చేసుకోవాలని, ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారి ఫోను కంట్రోల్‌ రూమ్‌కి కనెక్ట్‌ అవుతుందన్నారు. ప్రమాదంలో కానీ అత్యవసర సమాయాల్లో ఫోనును 5 సార్లు షేక్‌ చేస్తే ప్రమాదంలో ఉన్నట్లు కంట్రోల్‌ రూమ్‌కు అలర్ట్‌ వస్తుం దన్నారు. దీంతో దగ్గర్లోని పోలీసులు 5 నిమిషా ల్లో బాధిత మహిళల వద్దకు వచ్చి సహాయం చేస్తారని వెల్లడించారు. అంతేకాకుండా ఇంట్లో నుంచి ఫిర్యాదు చేయొచ్చని, మిస్సింగ్‌ కేసు ఫిర్యాదులు ఈ యాప్‌ నుంచే చేయవచ్చ న్నారు. రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు నియర్‌ బై షెల్టర్‌ బటన్‌ ప్రెస్‌ చేస్తే ఆయా ప్రాంతంలోని సురక్షిత హోమ్‌లు చూపిస్తాయని తెలిపారు. మహిళల భద్రతకు పోలీస్‌ శాఖ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పటమట సీఐ వల్లభనేని పవన్‌కిషోర్‌, ఎస్సైలు కృష్ణవర్మ, హరికృష్ణ, జీ. రేవతి, డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌, ఉషాకుమారి, ఇంటర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ స్వప్న, విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:24 AM