Share News

కందకాల తవ్వకం ఆపాలి

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:25 AM

మండలంలో అమ్మాదేవి కొండ చుట్టూ ఏనుగుల జోన్‌ కోసం చేపడుతున్న కందకాల తవ్వకం పనులు నిలుపుదల చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

కందకాల తవ్వకం ఆపాలి

సీతానగరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో అమ్మాదేవి కొండ చుట్టూ ఏనుగుల జోన్‌ కోసం చేపడుతున్న కందకాల తవ్వకం పనులు నిలుపుదల చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి, తాన్న సీతారాంపురం, పులిగుమ్మి, గదబవలస, రేపటివలస, తామరఖండి గ్రామాల ప్రజల సహకారంతో మంగళవారం ఆ పనులను అడ్డుకున్నారు. రైతు సంఘం నాయకుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ కొండ పరిసర ప్రాంతాల్లో గత 50 ఏళ్లుగా పేదలు సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ప్రజాభి ప్రాయ సేకరణ చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. నిరసనలో ఐక్య కార్యాచరణ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:25 AM