Share News

సమయ పాలన పాటించండి

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:24 AM

వైద్య సిబ్బం ది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి జీవనరాణి అన్నారు.

సమయ పాలన పాటించండి

రామభద్రపురం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బం ది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి జీవనరాణి అన్నారు. మండలంలోని ఆరిక తోట, రామభద్రపురం పీహెచ్‌సీలను ఆమె మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె వైద్య సిబ్బంది హాజరుపట్టీని పరిశీలించారు. ఆన్‌లైన్‌లో కూడా అటెండె న్స్‌ చూశారు. అనంతరం ఓపీ రిజిష్టర్‌, ల్యాబ్‌లను పరిశీ లించారు. డెలివరీ కేసులు, మందుల పరిస్థితిపై ఆరా తీశారు. వేసవిలో జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఆరికతోట పీహెచ్‌సీలో నాలుగు జ్వరాల కేసులు వచ్చా యని, వీరికి మెరుగైన వైద్యం అందించాలని సూచించా రు. అనంతరం పీహెచ్‌సీలోని సమస్యలను వైద్యుడు దిలీప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్ర మంలో ఆరికతోట పీహెచ్‌సీ వైద్యాధికారిణి అపర్ణ, ఈవో మల్లికేశ్వరరావు, పీహెచ్‌ఎన్‌ పద్మావతి, ఫార్మాసిస్టు పొట్టా కిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:24 AM