Share News

అంబేడ్కర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Apr 15 , 2024 | 01:15 AM

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.

అంబేడ్కర్‌కు ఘన నివాళి
కర్నూలులో అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 14: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ 133వ జయం తిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కోడుమూరు టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, రాష్ట్ర కార్యదర్శులు నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్‌, పార్లమెంట్‌ పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షుడు డీ.జేమ్స్‌, సత్రం రామక్రిష్ణుడు, షేక్‌ ముంతాజ్‌, పి.హనుమంతరావు చౌదరి, కుంపటి క్రిష్ణ పాల్గొన్నారు.

ఫ కాంగ్రెస్‌ కార్యాలయంలో.. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కే.బాబురావు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకముందు పాత బస్టాండ్‌ సమీ పంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా కార్యా లయంలో కార్యకర్తలు సమావేశం జరిగింది. కార్యక్రమంలో కోడుమూరు కాంగ్రెస్‌ అభ్యర్థి పరిగెల మురళీకృష్ణ, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, డీసీసీ ఉపాధ్యక్షుడు బీ.బతుకన్న, అనంతరత్నం మాదిగ, లాజరస్‌, ప్రమీల, వెంకట సుజాత, సత్యనారాయణగుప్త పాల్గొన్నారు.

ఫ ఆర్‌యూలో.. రాయలసీమ యూనివర్సిటీలో అంబేడ్కర్‌ విగ్రహానికి రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌టీకే నాయక్‌ పూలమాలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ పి.నాగరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదు: టీజీ భరత్‌

రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలు కావడంలేదని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. పాతబస్టాండ్‌ సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఎంపీ ఆభ్యర్థి బస్తాపాటి నాగరాజుతో టీజీ భరత్‌ కలిసి పూలమా లలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నగర ఆధ్యక్షులు నాగరాజు యాదవ్‌, జనసేన ఇన్‌చార్జి హర్షద్‌, దళిత జేఏసీ చైర్మన్‌ బోల్లెద్దుల రామక్రిష్ణ, దళిత సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

కల్లూరు: నందికొట్కూర్‌ టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి ఆదివారం తన స్వగృహంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు రాజ్యాంగంలో సముచిత స్థానం కల్పించిన మహనీయుడు అంబే డ్కర్‌ అని కొనియాడారు. కర్నూలు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ పెరుగు పురుషోత్తంరెడ్డి, నన్నూరు విశ్వేశ్వరరెడ్డి, పాలకొలను సుధాకర్‌రెడ్డి, ఎన్వీ.రామకృష్ణ, ప్రభాకర్‌ యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, శ్రీరాములు అయ్యస్వామి పాల్గొన్నారు.

విద్యుత్‌ భవన్‌లో: విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీఎస్‌పీడీసీఎల్‌ కర్నూలు ఉమ్మడి జిల్లా ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ ఎం.ఉమాపతి అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ.బాబు రాజేంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షులు ఎం.శివకుమార్‌, బెళగల్‌ హుశేని, ఎస్‌ఏఓ రాఘవులు, ఈఈ లు రాజేష్‌, ఓబులేసు, డీఈఈలు విజయభాస్కర్‌, సుబ్బన్న పాల్గొన్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణంలో అంబేడ్కర్‌ విగ్రహానికి డీఎంహెచ్‌వో డా.వై.ప్రవీణ్‌ కుమార్‌, అడిషినల్‌ డీఎం హెచ్‌వో డా.భాస్కర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏవో కే.అరుణ, డీఎస్‌వో నాగప్రసాద్‌, డెమో ప్రమీలాదేవి, ఎస్‌వో హేమసుం దరం, డీపీవో విజయరాజు, డిప్యూటీ డెమో చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

కర్నూలు(లీగల్‌): స్థానిక బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో అంబే డ్కర్‌ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షులు బి.కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి బీఎస్‌ రవికాంత్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి బీఎస్‌ రవికాంత్‌ ప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాదులు పి.నాగభూషణం నాయుడు, కె.ఓంకార్‌, ఏ.మాధన్న, ఎస్‌.రంగరవి, బి.చంద్రుడు, ఆర్‌.ఆనందరావు, ఎన్‌.సుబ్బయ్య, మహిళా ప్రతినిధి జి.సుమనారాణి పాల్గొన్నారు.

కర్నూలు(న్యూసిటీ): అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్‌ సీఈఓ చాంబర్‌లో సీఈఓ జి.నాసరరెడ్డి, పరిపాలన అధికారి సరస్వతమ్మలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. కార్యక్ర మంలో మహ్మద్‌హక్‌, ఉమాదేవి, సుమయ, రమణారెడ్డి, రఫి, వినీత, క్రిష్ణా రావు పాల్గొన్నారు.

ఫ నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ భార్గవతేజ అంబే డ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, ఇన్‌చార్జి డీసీపీ సంధ్య, రెవెన్యూ ఆఫీసర్‌ జునైద్‌, మేనేజర్‌ చిన్నరాముడు, టీపీఆర్‌ఓ వెంకటలక్ష్మి, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ మన్సూర్‌ పాల్గొన్నారు.

ఓర్వకల్లు: భారత రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్‌ అని నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని హుశేనా పురం ఎస్సీ కాలనీలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఓర్వకల్లులో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, రామకోటేశ్వరరావు, శ్రీరాములు, భాస్కర్‌ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, పార్థసార ధిరెడ్డి, హరి, చిన్న, అల్లబాబు, సుధాకర్‌, కేవీ మధు, నాగరాజు, రాముడు, విక్రమ్‌, బజారు పాల్గొన్నారు.

కర్నూలు(ఎడ్యుకేషన్‌): పాతబస్టాం డులోని అంబేడ్కర్‌ విగ్రహానికి పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, రామక్రిష్ణలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఫ పాతబస్టాండులోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఎస్టీయూ జిల్లా అధ్యక్ష , కార్యద ర్శులు గోకారి, టీకే జనార్దన్‌, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మ న్నలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

కోడుమూరు: స్థానిక పంచాయతీ కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు సర్పంచు భాగ్యరత్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల వేసి నివాళ్లు అర్పించారు. అలాగే టీడీపీ మాల మహానాడు, ఎమ్మార్పీ ఎస్‌, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంబే డ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆంధ్రయ్య, పంచాయతీ కార్యదర్శి అజయ్‌భాస్కర్‌, మునిస్వామి, బాలక్రిష్ణ, నాగేష్‌, గోపాల్‌నాయుడు, బాలరాముడు, రాముడు పాల్గొన్నారు.

కోడుమూరు(రూరల్‌): మండలంలోని ప్యాలకుర్తిలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక ఆటో స్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి గ్రామప్రజలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం అందించి దేశానికి దిశానిర్ధేశం చూపిన గొప్ప మేధావి అని అంబేద్కర్‌ సేవలను కొనియాడారు. అంబేద్కర్‌ ఆశయ సాధనకు పాటుపడతామని నినదించారు. కార్యక్రమంలో ప్రదీప్‌, మురళి, సుంకన్న, సునీల్‌, భాస్కర్‌, ఖలీల్‌, తులసీరెడ్డి, క్రిష్ణారెడ్డి, రాజు, బాలముని, గిరి తదితరులు పాల్గొన్నారు.

గూడూరు: గూడూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి కోడుమూరు టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ మాజీ వైస్‌ చైర్మన్‌ కురుకుంద రామాంజనేయులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు, పార్టీ అధికార ప్రతినిధి దండు సుందరరాజు, నాయకులు జె సురేష్‌, రేమట వెంకటేష్‌, పౌలు, సృజన్‌, కౌన్సిలర్లు బుడ్డంగలి, కోడుమూరు షాషావలి, నాగప్ప యాదవ్‌, విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 01:15 AM