మదనపల్లె అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా..
ABN , Publish Date - Jun 09 , 2024 | 11:30 PM
మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచే స్తానని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.

మదనపల్లె టౌన, జూన 9: మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచే స్తానని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీ న వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి ఎన్ని కల కోడ్ ఉండటంతో నివాళులర్పించలేకపోయామని, ఇప్పుడు కోడ్ ముగియడంతో ఎన్టీ ఆర్‌కు నివాళులర్పిస్తున్నామన్నారు. చంద్రబాబునాయుడు ఆదేశాలతో ప్రజలందరికి అం దుబాటులో ఉంటూ పనిచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు మోడెం సిద్దప్ప, నాదెళ్ల విద్యాసాగర్, మున్సిపల్ మాజీ చైర్మన కొడవలి శివప్రసాద్, బోయపాటి రామ్మూర్తి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు నీలకంఠ, బాబునాయుడు, పులి మహాలక్ష్మి, తలా రి రాధ, సాకే లక్ష్మిదేవి, టీడీపీ నాయకులు నవీన చౌదరి, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, జీవీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.