Central Govt.: నెల్లూరు జిల్లాలో క్వార్టజ్ అక్రమాలపై కేంద్ర సీరియస్
ABN , Publish Date - Jan 12 , 2024 | 09:16 AM
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రూ. వేల కోట్ల క్వార్ట్జ్ (తెల్లరాయి) అక్రమాలను ముందుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఏబీఎన్ కథనాలతో అక్రమాల డొంక కదిలింది.
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రూ. వేల కోట్ల క్వార్ట్జ్ (తెల్లరాయి) అక్రమాలను ముందుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఏబీఎన్ కథనాలతో అక్రమాల డొంక కదిలింది. దీనిపై కొన్ని నెలలుగా టీడీపీ ముఖ్య నేతలు పోరాటం చేస్తున్నారు. క్వార్ట్జ్ అక్రమాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రికి ఆధారాలతో సహా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుంది? పెద్ద ఎత్తున క్వార్ట్జ్ తవ్వేస్తుంటే మీరేం చేస్తున్నారు? అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకున్నారు? కొల్లగొట్టిన క్వార్ట్జ్ విలువ ఎంత? పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి, పదిరోజుల్లోపు నివేదిక ఇవ్వాలని అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెల్లరాయి (క్వార్ట్‌జ్) గనులపై అధికార పార్టీ గద్దలు వాలాయి. గతంలో ఎప్పుడూ తెల్లరాయి ధర టన్నుకు రూ.5 వేలు దాటలేదు. అలాంటిది అనూహ్యంగా మార్కెట్‌లో టన్ను కనీస ధర రూ.18 వేలు పలుకుతోంది. కలిసొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. లాభాలు గడిద్దామని లీజుదారులు భావించగా.. వైసీపీ ప్రజాప్రతినిధి ఒకరు రంగంలోకి దిగారు. ‘లీజు మీది. తవ్వేది మీరు. కానీ.. నాకే అమ్మాలి. నేను చెప్పినంత ధరకే ఇవ్వాలి’ అని అల్టిమేటం జారీ చేశారు. టన్ను తెల్లరాయి కేవలం రూ.5 వేలకు తనకు మాత్రమే ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఆయన వెనుక మరికొందరు నేతలు ఉన్నట్లు సమాచారం.