గ్రామాభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే బుడ్డా
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:21 AM
గ్రామాల్లో అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

బండిఆత్మకూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. మండలం లోని ఎర్రగుంట్ల, కడమలకాల్వ, పెద్దదేవళాపురం గ్రామాల్లో శుక్రవారం రూ.67 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. రబీలో కేసీ, తెలుగుగంగ కాల్వల కింద పంటలు సాగు చేసిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నీరు అందిస్తామని చెప్పారు. అనంతరం బండిఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో వ్యవసాయ శాఖ రైతులకు మంజూరు చేసిన పనిముట్లను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో కేసీ కెనాల్ చైర్మన్ రామలింగారెడ్డి, నాయకులు సురేష్‌రెడ్డి, నరసింహారెడ్డి, మనోహర్‌చౌదరి, బుగ్గరాముడు, జగన్మోహన్‌రెడ్డి, సిద్ధయ్య, రఘురెడ్డి, మల్లికార్జునరెడ్డి, మదన భూపాల్, సుబ్బలక్ష్మయ్య, కృష్ణనాయక్, రామలింగం, ప్రసాద్, సర్పంచ్ శ్వేత కుమారి పాల్గొన్నారు.
మహానంది: ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్‌సిక్స్‌తో పాటు సంక్షేమ పధకాల అమలు చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మహానంది మండలం అల్లీనగరం, సీతారామపురం, మసీదుపురం గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన సీసీ రోడ్లను రహదార్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. కేసీ కెనాల్ అధ్యక్షుడు బన్నూరి రామలింగారెడ్డి, ఎంపీపీ యశస్వినిరెడ్డి, మండల క్లస్టర్ ఇన్‌చార్జి నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు క్రాంతికుమార్, సుంకులయ్య, ఎంపీడీవో మహామ్మద్ దౌలా, హౌసింగ్ ఏఈ షపివుల్లాతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.