డీసీవో శ్రీనివాసరెడ్డి సరెండర్
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:29 AM
జిల్లా సహకారశాఖ అధికారి (డీసీవో) శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ శుక్రవారం రాత్రి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల సహకార శాఖలో జరుగుతున్న పలు పరిణామాలతోపాటు ఆ శాఖ ను సమన్వయం చేయడంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది.

కలెక్టర్ అన్సారియా ఉత్తర్వులు
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకారశాఖ అధికారి (డీసీవో) శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ శుక్రవారం రాత్రి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల సహకార శాఖలో జరుగుతున్న పలు పరిణామాలతోపాటు ఆ శాఖ ను సమన్వయం చేయడంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో కలెక్టర్ అన్సారియా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో కూడా సహకార రంగంలో జిల్లా వెనుకబడి ఉంది. ఆ శాఖ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాల అమలులో కూడా శ్రీనివాసరెడ్డి ఉదాసీనంగా వ్యవహరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు.