AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!
ABN , Publish Date - Apr 07 , 2024 | 01:29 PM
బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్(YS Jagan) సొంత పార్టీ ఎమ్మెల్యేలే పెద్ద ఝలక్ ఇచ్చారు. ప్రకాశం(Prakasam) జిల్లాలో జగన్ బస్సు యాత్ర సాగుతుండగా.. జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి(Mahidhar Reddy), దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్(Venugopal) ఈ బస్సు యాత్రకు..
ప్రకాశం, ఏప్రిల్ 07: బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్(YS Jagan) సొంత పార్టీ ఎమ్మెల్యేలే పెద్ద ఝలక్ ఇచ్చారు. ప్రకాశం(Prakasam) జిల్లాలో జగన్ బస్సు యాత్ర సాగుతుండగా.. జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి(Mahidhar Reddy), దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్(Venugopal) ఈ బస్సు యాత్రకు దూరంగా ఉన్నారు. జగన్‌కి ముఖం చాటేసి మహిధర్ రెడ్డి హైదరాబాద్(Hyderabad) వెళ్లిపోగా.. వేణుగోపాల్ బెంగళూరుకు(Bengaluru) వెళ్లాడు. కందుకూరు, దర్శిలో జగన్ బస్సు యాత్ర ఉన్నా.. ఈ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. అయితే, టిక్కెట్ దక్కకపో వడంతో ఈ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే జగన్ బస్సు యాత్రను వారు లైట్ తీసుకున్నట్లు సమాచారం.
సాయంత్రం సిద్ధం సభ..
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు వైసీపీ ‘మేమూ సిద్ధం’ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ఓట్ల కోసం ప్రకాశం జిల్లాకు వస్తున్న జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ జిల్లాపై శీతకన్నేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ నిలిపివేశారు. 2019 ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీలన్నింటినీ మరిచిపోయారు జగన్. నిర్మాణం పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించారు. నిర్వాసితులను పోలీస్ స్టేషన్‌లో పెట్టి వెలుగొండ ప్రాజెక్టు వద్ద శిలాఫలకం ఆవిష్కరించారు సీఎం జగన్.
వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. వెలుగొండ నీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకి రెండు గేట్లు కొట్టుకుపోయినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సీటి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. ట్రిపుల్ ఐటి కాలేజీ నిర్మాణాలు గాలికొదిలేశారు. మార్కాపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం ముందుకు కదల్లేదు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఊసే ఎత్తలేదు. కనిగిరిలో నిమ్జ్ నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చినా.. జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దర్శిలో ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణాన్ని సైతం పక్కన పెట్టారు సీఎం జగన్. ఇలా జిల్లాకు సంబంధించి అన్ని ప్రాజెక్టులను విస్మరించిన జగన్.. ఇప్పుడు జిల్లా ప్రజల ఓట్లను అడిగేందుకు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి:
ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..
హైదరాబాద్ వాసులకు బిగ్ షాక్..!