AP News: రోడ్డు మరమ్మతు కోసం నిరసన.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:41 PM
Andhrapradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉంగర మండలంలోని బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయం అయ్యింది. ఈ రహదారి 2010 నుంచి పూర్తిగా గోతులుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రాజాం నుంచి బేంగపేట వెళ్లేందుకు ఒకే ఆర్టీసీ బస్సు ఉంటుంది.

శ్రీకాకుళం, డిసెంబర్ 26: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) రాజాం నియోజకవర్గంలో స్థానికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రోడ్లకు మరమ్మతు చేయాలని డ్రోన్లతో నిరసన తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస నుంచి భాగ్యమ్మపేట వరకు రోడ్లు మొత్తం గోతులమయంగా మారాయి. దీంతో ఆ రోడ్లకు మరమ్మతు చేయాలంటూ డ్రోన్ ద్వారా నిరసన తెలిపారు స్థానిక ప్రజలు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని ఉంగర మండలంలోని బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయం అయ్యింది. ఈ రహదారి 2010 నుంచి పూర్తిగా గోతులుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రాజాం నుంచి బేంగపేట వెళ్లేందుకు ఒకే ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఆ బస్సు కూడా రోడ్డు సరిగా లేని కారణంగా అధికారులు దాన్ని రద్దు చేశారు. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇదంతా గమనించిన స్థానికులు రోడ్ల మరమ్మతులపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు.
రహదారి వేయాలని మొరపెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించన పరిస్థితి. దీంతో గ్రామానికి చెందిన యువకులు వినూత్నమైన నిరసన కార్యక్రమానికి చర్యలు చేపట్టారు. అందుకోసం డ్రోన్‌ను ఉపయోగించుకున్నారు యువకులు. డ్రోన్‌కు తమ నిరసనను తెలియజేస్తూ ఒక బ్యానర్‌ను కట్టారు. అనంతరం ఆ డ్రోన్ ద్వారా మొత్తం రహదారి పరిస్థితిని వివరిస్తూ వీడియోను తీశారు. ఆ వీడియోను కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సంచలనంగా మారింది. ఉంగర మండలంలో ఉన్న బేగంపేట, కొండవలస ఉన్న దాదాపు పదిగ్రామాలకు ఆ రహదారికి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ గ్రామాలకు వెళ్లాలంటే ఇదే ప్రధానమైన రహదారి.
Yarlagadda: జగన్ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు
అయితే రోడ్ల మరమ్మతులపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆ రహదారిపై వెళ్లలేని పరిస్థితికి వచ్చింది. ఆ రోడ్డుపై సొంత వాహనాల్లోనూ గ్రామాలకు వెళ్లలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు చెప్పినప్పటికీ వారంతా కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరించడం అలవాటుగా మారిపోయింది. దీంతో గుంతలమయైన రహదారుల మరమత్తు కోసం స్థానిక యువకులు ఈ రకమైన నిరసనకు దిగారు. మొత్తానికి ఆ రహదారికి సంబంధించి కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుని.. రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. డ్రోన్ల ద్వారా తమ సమస్యలను తెలియజేస్తూ యువకులు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి..
సీఎంతో సమావేశం.. కింగ్ నాగార్జున ప్రతిపాదనలివే..
Viral: బ్రిటన్‌లో ఉండలేనంటూ తిరిగొచ్చిన భారతీయ డాక్టర్! కారణం తెలిస్తే..
Read Latest AP News And Telugu News